మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి: మచిలీపట్నం పోర్టు…నిర్మాణ పనుల ప్రారంభోత్సవం.ఇక మారనున్న కృష్ణా జిల్లా ముఖచిత్రం.పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మంగినపూడిలో నేడు ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌.భూసేకరణ చేసి, అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలు పరిష్కరించి, టెండర్లు ఫైనలైజ్‌ చేసి, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తి చేసి ఈ రోజు పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం.మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం, వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు శుభారంభం.

 Cm Jagan To Lay Foundation Stone For Machilipatnam Port, Cm Jagan , Foundation S-TeluguStop.com

ఇప్పటికే రామాయపట్నంలో శరవేగంగా జరుగుతున్న పనులు, మూలపేట పోర్టు పనులు కూడా ఇప్పటికే ప్రారంభం, చురుగ్గా సాగుతున్న కాకినాడ గేట్‌ వే పోర్టు పనులు, మరి నేడు బందరు ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ…మచిలీపట్నం పోర్టు.35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్ధ్యంతో 2 జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్‌–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు వినియోగపడేలా మొత్తం 4 బెర్తులతో మచిలీపట్నం పోర్టు నిర్మాణం,

24–30 నెలల్లో పోర్టు పనులు పూర్తి, ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి, పెరగనున్న వాణిజ్య కార్యకలాపాలు, ట్రాఫిక్‌కు అనుగుణంగా 16 బెర్తులతో 116 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్ధ్యం వరకు పోర్టు విస్తరణ.రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంట నూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్‌ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారనున్న మచిలీపట్నం పోర్టు.

ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బందరు మండల పరిధిలోని తపసిపూడి గ్రామం సీఎం జగన్ చేరుకుంటారు.అక్కడి నుంచి పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ, అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.ఆ తర్వాత మచిలీపట్నంలోని జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.సభ అనంతరం మచిలీపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube