డిప్రెషన్, యాంగ్జైటీ( Depression, anxiety ) వంటి రోగాలు మనుషులకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులను ఏర్పరుస్తాయో చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ప్రపంచంలో సగటున సెకెనుకు ముగ్గురు చొప్పున డిప్రెషన్, యాంగ్జైటీ వంటి రోగాల వలన బాధపడుతున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి.
ఇలాంటి రోగాల బారిన పడినవారు సైకాలజిస్టుల దగ్గరకు వెళుతూ వుంటారు.అయితే వాస్తవం చెప్పుకోవాలంటే మానసిక రోగానికి మందే లేదని చెప్పుకోవాలి.
ఇలాంటి పరిస్థితులలో అధునాతన ఏఐ (AI) వాయిస్ ఆధారిత వర్చువల్ కోచ్ (లుమెన్ యాప్) కూడా మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను సమర్ధవంతంగా అందించగలదని కొత్త అధ్యయనం ఒకటి చెబుతోంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence )(AI)ను వివిధ రంగాల్లో దాని అప్లయ్ చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఆసక్తి నెలకొన్న సందర్భంలో ఇపుడు ఈ విషయం చర్చనీయాంశం అవుతోంది.ఒక వైపు అది ఏ విధంగా పనిచేస్తుందనే విషయంలో అనేక సందేహాలు ఉన్నప్పటికీ, మరోవైపు దాని వినియోగంపై ప్రయోగాలు, అధ్యయనాలు కొనసాగుతుండడం కొసమెరుపు.
తాజాగా ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ యాప్ మైల్డ్ డిప్రెషన్( Voice assistant app mild depression ), యాంగ్జైటీలతో బాధపడుతున్న వ్యక్తులకు మానసిక చికిత్సను అందించగలదని పరిశోధకులు కనుగొన్నారు.ఈ అధ్యయనంలో భాగంగా ప్రాబ్లం సాల్వింగ్ థెరపీకి సంబంధించిన 8 ఎనిమిది సెషన్ల కోసం AI వాయిస్ అసిస్టెంట్ లుమెన్‌ని పరిశోధకులు వినియోగించగా దీనివల్ల బ్రెయిన్ యాక్టివిటీస్‌లో మార్పులు కనిపించాయని, యాంగ్జైటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గాయని చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకుల బృదం పేర్కొన్నది.అయితే దీనిపైన ఇంకా అధికారిక విషయాలు వెలువడాల్సి వుంది.