నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.ఈయన అఖండ తర్వాత మరింత యాక్టివ్ గా ఉంటూ సినిమాలు చేస్తున్నాడు.
ఇటీవలే సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఆ వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేసాడు.ఈ సినిమాను కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు తీరిక లేకుండా కష్ట పడుతున్నాడు.
బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”NBK108”.ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే బాలయ్య ఫుల్ ఫోకస్ తో పని చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమా సెట్స్ నుండి తాజాగా ఒక వీడియోను షేర్ చేసారు.సెట్స్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఫైట్ మాస్టర్ తో కలిసి బాలయ్య బాలయ్య అనే పాటకు డ్యాన్స్ వేశారు.అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టు కుంటున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.
అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
బాలకృష్ణ సింహా, లెజెంట్ వంటి సినిమాల తర్వాత మళ్ళీ చాలా ఏళ్ల వరకు హిట్ లేక రేసులో వెనుక బడ్డాడు.కానీ మళ్ళీ అఖండ వంటి యాక్షన్ బ్లాక్ బస్టర్ తో బాలయ్య ఫామ్ లోకి వచ్చాడు.ఇక అప్పటి నుండి బాలయ్య మరింత హుషారుగా సినిమాలు చేస్తున్నాడు.
ఇక అనిల్ సినిమా( Anil Ravipudi, )ను కూడా ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు.ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.