Pooja Hegde : పూజా హెగ్డే పెళ్లికి తల్లి పెట్టిన కండిషన్స్.. ఇక బుట్టబొమ్మ పెళ్లి అయ్యినట్లే?

మామూలుగా పెళ్లి చేసుకునే వాళ్ళు తమ జీవితంలో వచ్చే వ్యక్తులు అలా ఉండాలి ఇలా ఉండాలి అని కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు తమ తల్లిదండ్రులు కూడా కండిషన్స్ పెడుతూ ఉంటారు.

 Pooja Hegdes Mothers Conditions For Marriage Is It Like Getting Married To A Do-TeluguStop.com

అయితే ఇవి సామాన్యులకే కాదు ఒక హోదాలో ఉన్న వాళ్ళకి కూడా ఎదురవుతూ ఉంటాయి.అయితే రీసెంట్ గా పూజా హెగ్డే కి కూడా ఇటువంటిదే ఎదురయింది.

తన పెళ్లికి తన తల్లి పెట్టిన కండిషన్స్ చూసి జనాలు షాక్ అవుతున్నారు.ఇంతకు ఆమె తల్లి ఎటువంటి కండిషన్స్ పెట్టిందో ఇప్పుడు చూద్దాం.

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ బుట్టబొమ్మ పూజా హెగ్డే ( Pooja Hegde )తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2010లో అడుగు పెట్టింది.ఇక 2014లో ముకుంద సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమాలో తన తొలి నటనతో మంచి పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత ఒక లైలా కోసం ( Oka Laila Kosam )సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.నిజానికి దర్శక నిర్మాతలు కూడా పూజా హెగ్డే కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

ఆమెను సెంటిమెంట్ గా భావిస్తారు.ఇక అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఈ సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని బుట్ట బొమ్మగా నిలిచింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.కానీ ఇప్పుడు వరుసగా ఫ్లాప్ లు అందుకొని ఐరన్ లెగ్( Iron leg ) అని పేరు సంపాదించుకుంది.ఒకప్పుడు సెంటిమెంట్ గా భావించిన దర్శక నిర్మాతలు కూడా ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారు.

ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లో కలిపి అయిదారు స్టార్ హీరోల సినిమాలలో నటించి నిరాశపరిచింది.

ఇక ప్రస్తుతం ఆమె ఖాతాలో మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాలు కూడా నిరాశపరిస్తే పూజా హెగ్డే చాప్టర్ క్లోజ్ అయినట్లే.ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా తన తల్లి తన పెళ్లి గురించి కొన్ని కండిషన్స్ బయట పెట్టింది.

రీసెంట్ గా పూజా హెగ్డే మదర్స్ డే( Mothers Day ) సందర్భంగా తన మదర్ తో కలిసి ఓ బాలీవుడ్ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.దీంతో ఆమె తల్లికి.

పూజ హెగ్డే కి ఎటువంటి భర్త కావాలనుకుంటున్నారు అన్న ప్రశ్న ఎదురయింది.

ఇక వెంటనే ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది.పూజ హెగ్డే మొదటి నుంచి చాలా క్లియర్ గా ఉంటుందని.తనకి ఏం కావాలో తనకి అన్నీ తెలుసని.

చాలా మొండిది కూడా.తను చెప్పిందే జరగాలి అనుకునే టైపని తెలిపింది.

ఇక ఏ విషయం అయినా సరే చాలా ఎక్కువగా ఆలోచిస్తుందని.ముఖ్యంగా చాలా సెన్సిటివ్ . ఏ మాట అన్న ఏడ్చేస్తుందని అన్నది.

ఇక తన మనసును అర్థం చేసుకునే వాళ్ళు తనని ఒక మాట అంటే అస్సలు భరించలేదని.

ఎంత ప్రేమిస్తుందో అంతే ద్వేషిస్తుందని.త్వరగా కోపము వచ్చేస్తుందని.

ఓపిక తక్కువ.ఇవన్నీ అర్థం చేసుకోగలిగిన అబ్బాయి అయితే మా అమ్మాయికి ఓకే అని అన్నది.

దీంతో ఈమె మాటలు విన్న జనాలు ఇక మీ కూతురుకు పెళ్లి అయినట్టే అంటూ వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు.ఇక మరి కొంతమంది మీ కూతురికి పెళ్లి అయినట్లే అని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube