అండర్‌గ్రౌండ్ వాటర్ పైప్‌లో మొసలి.. రోబోని చూసి పరుగో పరుగు..

ఈ రోజుల్లో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో, కస్టమర్లకు సేవలను అందించడానికి రోబోలను పరిచయం చేస్తున్నారు.రోబోలు లేదా వర్చువల్ అసిస్టెంట్‌ల వినియోగం శరవేగంగా పెరుగుతోంది.

 Crocodile In The Underground Water Pipe See The Robot And Run Away , Artificial-TeluguStop.com

అయితే మర మనుషులను చూసి జంతువులు జంకుతున్నాయి.ప్రాణంలేని ఇవి మనుషుల లాగా లేదా ఇతర కొత్త జంతువుల్లాగా తిరుగుతుంటే వాటిని చూసి ఇవి భయపడుతున్నాయి.

రోబోలు( Robots ) అంటే జంతువులకు ఎంత భయం ఉంటుందో తెలిపే ఒక వీడియో తాజాగా వైరల్ అయ్యింది.ఇందులో ఒక మొసలి రోబోని చూసి ప్రాణ భయంతో పరుగులు తీసింది.

వివరాల్లోకి వెళ్తే ఫ్లోరిడాలో( Florida ), ఐదు అడుగుల మొసలి( crocodile ) తుఫాను కాలువలోకి ప్రవేశించింది.ఈ అండర్‌గ్రౌండ్ పైపులో పెట్రోలింగ్ కోసం ఒక రోబోను అధికారులు పంపించారు.అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత మొసలి ఆ రోబో ఎదురయ్యింది.దాంతో అది ఉలిక్కిపడింది.ఈ వింత వస్తువు, దాని కెమెరాల వల్ల మొసలి అయోమయంలో పడి కాసేపు నిర్ఘాంత పోయింది.ఇది జాగ్రత్తగా రోబోను సమీపించింది, కానీ చివరికి వెనుదిరిగి పారిపోయింది.

రోబో ఆగిపోవడానికి ముందు మరో 340 అడుగుల వరకు మొసలిని అనుసరించడం కొనసాగించింది.ఆ తర్వాత మొసలి ఊపిరి పీల్చుకుంది.

ఈ షాకింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.

ఆ ప్రాంతంలోని గుంతలను తనిఖీ చేసేందుకు నగర కార్మికులు రోబోను ఉపయోగిస్తున్నారు.ఈ ప్రాంతంలోని తుఫాను కాలువలు ప్రతి సంవత్సరం జూన్, నవంబర్ మధ్య ఫ్లోరిడాలో సంభవించే తుఫానులు, ఉష్ణమండల తుఫానుల సమయంలో వరదలను నిరోధించడంలో సహాయపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube