స్వాతి ముత్యం సినిమా కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చి ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటిస్తే రాధిక హీరోయిన్ గా నటించిన వీధి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 1985లో విడుదలై కుటుంబ కథా చిత్రంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
అయితే సరిగ్గా నాలుగేళ్లకు అంటే 1989లో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని దర్శకుడు కే విశ్వనాథ్ నిర్ణయించుకున్నారు.దాంతో హిందీలో హీరోగా కమల్ హాసన్ పాత్రలో అనిల్ కపూర్ ని అనుకోని ఈశ్వర్ అనే పేరును ఈ సినిమాకి టైటిల్ గా పెట్టారు.
ఇక ఈ సినిమాలో రాధిక పాత్రలో హిందీలో విజయ శాంతి హీరోయిన్ గా నటించింది.
అయితే ఇది హిందీలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఈశ్వర్ సినిమా గురించి బయట ప్రపంచానికి తెలియని ఒక విషయం ఉంది.ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని దర్శకుడు నిర్ణయించుకోగానే హీరోయిన్ గా జయప్రద (Jaya Prada )ను పెట్టుకోవాలని అనుకున్నాడు.అప్పటికే జయప్రదకు రాఘవేంద్రరావు చిత్రాల ద్వారా బాలీవుడ్( Bollywood ) లో మంచి పేరు ఉంది.కానీ బయటకు చెప్పలేని కొన్ని కారణాల వల్ల అనిల్ కపూర్ జయప్రదను హీరోయిన్ గా పెట్టడానికి అంగీకరించలేదు.
దాంతో గత్యంతరం లేని పరిస్థితిలో విజయశాంతిని తెరపైకి తీసుకురావాల్సి వచ్చింది.కానీ జయప్రదతో అనిల్ కపూర్ ఎందుకు నటించలేదు అనే వార్త అప్పట్లో వైరల్ గా మారింది.
అందుకు సరైన సమాధానం ఎప్పుడూ అఫీషియల్ గా చెప్పకపోయినా అందరికీ తెలిసిన విషయమే.శ్రీదేవి అనిల్ కపూర్ అన్న ఆయన బోనీ కపూర్ తో ప్రేమ, పెళ్లి అంటూ రిలేషన్స్ కొనసాగించారు.అప్పటికే శ్రీదేవికి జయప్రదకు గొడవలు ఉన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.దాంతో శ్రీదేవి బలవంతం పైననే అనిల్ కపూర్ జయప్రదను పక్కన పెట్టారు అనే వార్తలు కూడా వచ్చాయి.
ఇందులో నిజాలు ఏంటో తెలియక పోయినా అందరూ ఇదే నిజమని నమ్మారు.దాంతో ఇప్పటి వరకు అనిల్ కపూర్( Anil Kapoor ) జయప్రద తో కలిసి నటించలేదు.
మొత్తానికి శ్రీదేవి వల్ల జయప్రదకు ఒక క్లాసిక్ సినిమాలో నటించే అవకాశం కోల్పోయింది.కానీ విశ్వనాథ్ గారు అంతకుముందే జయప్రద తో సాగర సంగమం అనే సినిమా తీసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.