టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఒకవైపు హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు విజయం సాధించిన బాలకృష్ణ 2024 ఎన్నికల్లో( Balakrishna ) సైతం ఆశాజనకంగా ఫలితాలను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు.
వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించాలని బాలయ్య భావిస్తున్నారు.ఏపీలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి బాగానే ఉందనే సంగతి తెలిసిందే.
అయితే తెలంగాణ రాష్ట్రంలో( Telangana ) మాత్రం గత కొన్నేళ్లుగా టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు.అయితే తెలంగాణలో టీడీపీ ఉంటుందని అండగా నేనుంటానని బాలయ్య కామెంట్లు చేశారు.
ఫ్యాన్స్ కు మించినది ఏమీ లేదని సీనియర్ ఎన్టీఆర్ అంటే గ్రంథాలయం అని యువతకు ఆదర్శం అని ఆయన కామెంట్లు చేశారు.ప్రపంచంలో సీనియర్ ఎన్టీఆర్ అంత గొప్ప వ్యక్తి లేడని బాలయ్య చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు నేను అతిథిని కాదని టీడీపీ కార్యకర్తనని టీడీపీ మనదని బాలయ్య పేర్కొన్నారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం కోసం కష్టపడతానని బాలయ్య కామెంట్లు చేశారు.సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు.దేశం మొత్తం సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారని ఆయన అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన భిక్ష వల్లే వేర్వేరు పార్టీలలో ఉన్నవాళ్లు పదవులు అనుభవిస్తున్నారని బాలయ్య తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఆయన అన్నారు.ఎన్టీఆర్ కు ఇవ్వకపోతే ఎవరికి భారతరత్న( Bharat Ratna ) ఇస్తారంటూ ఆయన కామెంట్లు చేశారు.బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక మూవీలో నటిస్తున్నారు.
ఈ మూవీలో బాలయ్య యాక్టింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది.స్టార్ హీరో బాలకృష్ణ వరుస విజయాలతో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.