తిరుపతి జిల్లాలోని ఎస్వీ జూపార్క్ లో ప్రమాదం జరిగింది.బ్యాటరీ వాహనం తగిలి మూడేళ్ల చిన్నారి మరణించింది.
పార్క్ లో షాపు ముందు నిలిచి ఉన్న చిన్నారిని అనుకోకుండా బ్యాటరీ వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో చిన్నారి ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందింది.
కాగా మృతిచెందిన చిన్నారి తిరుపతిలోని రాయల్ నగర్ కు చెందినదిగా గుర్తించిన ముత్యాలరెడ్డిపల్లి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.