టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ( Sharwanand )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో శర్వానంద్ మహానుభావుడు, శతమానం భవతి, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రాధా, మహాసముద్రం, శ్రీకారం, జాను, పడి పడి లేచే మనసు ఇలా ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకున్న వారిలో శర్వానంద్ కూడా ఒకరు.ఇది ఇలా ఉంటే ఇటీవల శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కంటే ముందు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల అయింది.అయితే ఆ సినిమా ఊహించనివిధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఇది ఇలా ఉంటే హీరో శర్వానంద్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ప్రస్థానం.( prasthanam movie ) సినిమాకు దేవా కట్టా ( Deva Katta )దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఇందులో రూబీ పరిహార్( Ruby Parihar ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించి తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత రూబీ తమిళ, కన్నడ భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది.ప్రస్థానం తర్వాత రాజేంద్ర, ప్రేమలో ఏబీసీ, కమీనా, యక్ష తదితర సినిమాల్లో నటించి మెప్పించింది.కానీ ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.దాంతో నెమ్మదిగా ఈమె ఫేడ్ అవుట్ అయిపోయింది.చివరగా తెలుగులో 2014లో ఇట్స్ మై లైఫ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించినప్పటికీ అవి కూడా సక్సెస్ కాలేకపోయాయి.సినిమా అవకాశాలు రాకపోవడంతో రూబీ పరిహార్ మోడలింగ్ రంగంపై దృష్టి పెట్టినట్లు.
ప్రస్తుతం మోడలింగ్ రంగం వైపు దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ సమయం దొరికినప్పుడల్లా గ్లామరస్ అండ్ హాట్ ఫోటో షూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.వీటిని చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
అప్పటికీ, ఇప్పటికీ రూబీ ఇంతలా మారిపోయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.