టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్( Gopichand ) హీరోగా నటించిన తాజా చిత్రం రామబాణం.( Ramabanam ) ఇందులో డింపుల్ హయతి( Dimple Hayathi ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో విడుదలైన సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే రామబాణం టీమ్ ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో గోపీచంద్, డింపుల్ హయతి, డైరెక్ట్ శ్రీవాస్ తదితరులు పాల్గొన్నారు.ఈ నేపథ్యంలోనే ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు డింపుల్ అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ప్రెస్ మీట్ లో భాగంగా ఒక రిపోర్టర్ హీరోయిన్ డింపుల్ హయతిని ప్రశ్నిస్తూ.
ఈ మధ్య డైరెక్టర్స్ చాలా మంది హీరోయిన్స్ క్యారెక్టర్ లను డిఫరెంట్గా క్రియేట్ చేస్తున్నారు.కొత్త జానర్లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కూడా కొంచెం వల్గర్గా, రొమాంటిక్గా ఉన్నట్లు అనిపిస్తోంది అది నిజమేనా అని డింపుల్ హయతిని ప్రశ్నించాడు.
వెంటనే స్పందించిన డింపుల్.వల్గర్ అంటారేంటి అంటూ ఎదురు ప్రశ్నించింది.సినిమాలో ఎక్కడా అలాంటి సీన్స్ లేవు.
అలాంటి గ్లింప్స్ కూడా వదల్లేదు.సినిమా పాటల్లో, పోస్టర్లలో అన్ని చోట్ల శుభ్రంగా ఉన్నాను.వల్గర్ అంటుంటే తనకు ఏమీ అర్థం కావడం లేదని నవ్వుతూనే అసహనాన్ని వ్యక్తం చేశారు డింపుల్.
వెంటనే దర్శకుడు శ్రీవాస్ కలుగజేసుకున్నారు.ఇదొక ట్రెడిషనల్ సినిమా అని చెప్పారు.
అప్పుడు పక్కనే ఉన్న ఇంకొందరు సదరు రిపోర్టర్స్ మాట్లాడుతూ ఆ విషయాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు రిపోర్టర్ పై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు.