ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు( assembly elections ) మరియు పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం కూడా సమయం లేదు.ఆరు నెలల్లో ఎన్నికల హడావుడి మొదలు కాబోతుంది.
అధికార వైకాపా మరోసారి విజయాన్ని సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.ఇదే సమయంలో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తూ ఈసారి అధికారంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
కచ్చితంగా రెండు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని భావిస్తున్న తరుణంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీతో కచ్చితంగా ప్రభావం చూపించబోతున్నాడని అంత భావిస్తున్నారు.ఇలాంటి సమయంలో వైకాపా కి సొంత పార్టీ నాయకుల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు వ్యవహారం పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డికి కలిగే అవకాశాలున్నాయి.
ఇప్పటికే అవినాష్ రెడ్డి( Avinash Reddy ) తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే.త్వరలోనే సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుంది.
ఆ విషయంలో నిజం ఎంత ఉంది అనే విషయం తెలియదు, కానీ త్వరలోనే సిబిఐ అధికారులు ఎంపీని అరెస్టు చేస్తారని వార్తలు జోరుగా సాగుతున్నాయి.
ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీకి చెందిన నాయకులు అరెస్టు అవ్వడం వల్ల పార్టీకి డ్యామేజ్ ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ కేసు వ్యవహారాన్ని వచ్చే ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ( Janasena party ) లేవనెత్తి జగన్ ని టార్గెట్ చేస్తే జనాలు కచ్చితంగా అధికార పార్టీ పలచన అయ్యే అవకాశం ఉంటుంది.అందుకే ఎన్నికల ముందు ఈ తల నొప్పిని బోధించుకోవాలని జగన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడట.
ఢిల్లీ ట్రిప్ వేసి ఆ విషయమై తెలుసుకోవాలని భావిస్తున్నాడు.కానీ ఢిల్లీ నుండి పిలుపు రాక పోవడంతో జగన్ ఏం చేయాలో పాలు పోక దిక్కులు చూస్తున్నాడని రాజకీయ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.
ఈ కేసులో జగన్ రెడ్డి హస్తం కూడా ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.బాబాయ్ ని హత్య చేయించి అధికారం దక్కించుకున్నాడని జగన్ పై తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తే కచ్చితంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది.
ఈ మొత్తం వ్యవహారం నుండి జగన్ ఎలా తప్పించుకుంటాడు అనేది చూడాలి.