అవకాశాలు లేక ఏడాది ఇంట్లో కూర్చున్న... పూజా హెగ్డే కామెంట్స్ వైరల్!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి పూజ హెగ్డే ( Pooja Hegde ) ఒకరు.ప్రస్తుతం ఈమె తెలుగు హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Pooja Hegde No Movie Offers For One Year,kisi Kaa Bhai Kisi Kijaan, Pooja Hegde,-TeluguStop.com

ఇక పూజా హెగ్డే గత ఏడాది నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ కావడంతో ఈమెకు చేదు అనుభవం ఎదురయింది.ఇలా వరుస సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఈమెకు తిరిగి సినిమా అవకాశాలు రావడంతో ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్( Salman Khan ) హీరోగా నటించిన కిసీ కా భాయ్.కిసీ కీ జాన్ ( Kisi Ka Bhai Kisi Ki Jaan ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి పూజా హెగ్డే తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కెరియర్ మొదట్లో తనకు తెలుగు తమిళ భాషలు అసలు వచ్చేది కాదని స్క్రిప్ట్ ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్లతో చర్చలు జరిపి ఆ తరువాత తాను మాట్లాడే ప్రయత్నం చేసేదానినని పూజా హెగ్డే తెలియజేశారు.


ప్రస్తుతం తాను అనుభవిస్తున్న ఈ స్టార్ హోదా( Star Status ) తనకు ఒక్కరోజు రాత్రిలో వచ్చినది కాదని, ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డానని తెలియజేశారు.ఇటీవల కాలంలో తాను నటించిన సినిమాలు పెద్దగా ఆడక పోవడంతో తనకు అవకాశాలు రాలేదు దీంతో ఏడాది పాటు ఇంట్లోనే కూర్చున్నానని, తిరిగి అవకాశాలు రావడంతో తాను సినిమా పనులలో బిజీగా ఉన్నానని ఈ సందర్భంగా పూజా హెగ్డే చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇంకా తనకు సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి పాత్రలలో నటించాలని ఉందని, ముఖ్యంగా మహిళ ప్రాధాన్యత( Lady Oriented ) ఉన్న సినిమాలలో నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా పూజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube