ఎలక్ట్రిక్ వెహికల్స్ దిగ్గజం టెస్లా గురించి, దాన్ని వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గురించి తెలియనివారు దాదాపుగా వుండరు.కాగా టెస్లా మరో ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తోంది.
ఈ ఏడాదిలో ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవ్’( Full Self Drive ) టెక్నాలజీని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఎలాన్ మస్క్( Elon Musk ) తాజాగా ప్రకటించడం విశేషం.భవిష్యత్తులో పూర్తిగా ఆటోనమీ వాహనాలదే హవా అయితే ఈ టెక్నాలజీకి మరింత గిరాకీ ఏర్పడే అవకాశం ఉందని మస్క్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
దీంతో ప్రస్తుతమున్న రేటుతో పోలిస్తే ఆనాటికి మరింత ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని మస్క్ చెప్పారు.
సెల్ఫ్ డ్రైవింగ్ కేపెబిలిటీతో వాహనాలను లాంచ్ చేస్తామని గతంలోనే ఆయన ప్రకటించినప్పటికీ అది సఫలం కాలేదు.దీంతో కాస్త సందేహిస్తూనే మస్క్ తాజా ప్రకటన చేయడం విశేషం.ప్రైజ్ కట్స్ వల్ల ఏర్పడిన నష్టాన్ని పూరించేందుకు ఇది తనకు ఉపయోగ పడుతుందని టెస్లా అధినేత అనుకుంటున్నారు.
ప్రైజ్ కట్స్‌తో పాటు ఫుల్ సెల్ఫ్ డ్రైవ్ టెక్నాలజీ రెవెన్యూ పెరుగుతుండటం కూడా ఇందుకు కారణమని కిక్‌హార్న్( Kickhorn ) అభిప్రాయపడ్డారు.ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయితే కుదురుకుంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా మాస్క్ చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.ఫుల్ సెల్ఫ్ డ్రైవ్ టెక్నాలజీ రిలీజ్‌కు రెండు అడుగులు ముందుకు వేస్తే, ఒక అడుగు వెనక్కి పడుతోందని మస్క్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.ఏదేమైనా భవిష్యత్తులో పూర్తిగా ఫుల్ సెల్ఫ్ డ్రైవ్, ఆటోనమీ దిశగా సాగుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని కాన్ఫరెన్స్‌లో ధీమా వ్యక్తం చేసారు.అయితే ఈ టెక్నాలజీ కారును పూర్తిగా ఆటోనమీగా చేయబోదని, డ్రైవర్ పర్యవేక్షణ తప్పనిసరి అంటూ మస్క్ స్పష్టం చేశారు.
ఈ వ్యూహం తమకు లాభిస్తుందని మస్క్ చెప్పారు.