మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రాజీనామా చేయాలని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు.నాలుగు సంవత్సరాలుగా ముద్దాయిని సీఎం జగన్ కాపాడారని ఆరోపించారు.
వివేకా హత్య కేసులో త్వరలోనే ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారని దేవినేని తెలిపారు.కోడికత్తి కేసులో కూడా జగన్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందని చెప్పారు.
ఈ క్రమంలో జగన్ ను ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.