తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మన సీనియర్ హీరోలు( Senior Heroes ) అయినా చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరో లు ఇప్పటికి రొటీన్ ఫార్ములా సినిమాలే చేస్తున్నారు.అవి అయితేనే హిట్ అవుతాయి అనే ఆలోచనలో ఉండి అవే సినిమాలు వరుసగా చేస్తూ వస్తున్నారు…సీనియర్ హీరోలనే కాదు యంగ్ స్టార్ హీరోలు కూడా ఇలానే చేసున్నారు ఇకపోతే డైరెక్ట్ సినిమాలు చేయడం మానేసి వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలని చేస్తూ రీమేక్ లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వస్తున్నారు…సౌత్ ఇండస్ట్రీ లో ఒక మూస ధోరణిలో కాకుండా ప్రయోగాత్మకంగా సినిమాలు చేసే హీరో లు ఎవరైనా ఉన్నారు అంటే అది మళయాళం హీరోలు అనే చెప్పాలి వాళ్ళు సినిమా సినిమాకి ఏదో ఒక వైవిద్యం చూపిస్తూ ఉంటారు…
ప్రయోగాత్మకమైన సినిమాలు తీయాడానికి అక్కడి హీరోలు కానీ దర్శకులు కానీ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు…అందుకే అక్కడి దర్శకులు అలవోకగా అలాంటి సినిమాలు తీస్తూ విడుదల చేస్తూ ఉంటారు.
భారీ బడ్జెట్ కు వెళ్లకుండా ఎంత భిన్నమైన కథను కూడా తక్కువ బడ్జెట్ లో తీయడం మలయాళ చిత్ర దర్శకుల ప్రతిభ అని ఒప్పుకోక తప్పదు.అందుకే మన తెలుగు స్టార్ హీరోలు అంతా కూడా మలయాళం సినిమాలను రీమేక్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
ఇంకా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అక్కడ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే హీరోయిజం అనే చట్రం లో నలిగిపోకుండా లేదా ఇరుక్కోకుండా ఎలాంటి విభిన్నమైన పాత్రను పోషించడానికి అయిన సిద్ధంగా ఉంటారు.మోహన్ లాల్( Mohan Lal ) లాంటి ఒక స్టార్ హీరో పని వాడి పాత్రలో కూడా చేయగలడు.అలాగే మమ్ముట్టి ( Mammooty ) లాంటి గొప్ప హీరో పాలవాడి పాత్రను కూడా పోషించగలడు.అందుకే మలయాళ సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా అన్ని సినిమాల ఇండస్ట్రీలతో పోలిస్తే ఒక అడుగు ముందుంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు.
అక్కడ నటిస్తున్న హీరోలు కూడా అందరూ హీరోల కన్నా భిన్నమైన వారు అని కూడా ఒప్పుకోవాల్సిందే.అక్కడ సినిమాలను పట్టుకొచ్చి మనదైన హీరోయిజం, కమర్షియల్ ఎలిమెంట్స్ , ఎలివేషన్ సీన్స్ జోడించి, మసాలా పూసి మళ్లీ దాన్ని రీమేక్ అనే అవసరం లేని ఒక పేరు పెట్టి తెలుగు వారి మీద రుద్దేస్తూ ఉంటారు.ఎందుకు మన పెద్ద హీరోలు ఒక పాలవాడి పాత్ర పోషించరు అని వాళ్ల అభిమానులు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది…అన్ని రకాల పాత్రలు చేసినప్పుడే వాళ్ళు మంచి నటులుగా గుర్తింపు పొందుతారు ఇక మీదట వచ్చే సినిమాల్లో అయిన మన హీరో లు కొంచం కంటెంట్ ఉన్న సబ్జెక్టు ని తీసుకొని పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు చేస్తే బాగుంటుంది…
.