ఈ మధ్యకాలంలో టెక్నో పెయింట్స్( Techno Paints ) గురించి మార్కెట్లో బాగానే వినబడుతోంది.నిన్న మొన్నటి వరకు ఏషియన్ పెయింట్స్ అనేవారు ఇపుడు టెక్నో పెయింట్స్.
టెక్నో పెయింట్స్ అని అంటున్నారు.ఇక అసలు విషయంలోకి వెళితే, టెక్నో పెయింట్స్ రూ.46 కోట్లతో కొత్తగా 3 ప్లాంట్లను ఈ ఏడాదే, మనదగ్గర నెలకొల్పుతోంది.ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నం, చిత్తరుతోపాటు మధ్యప్రదేశ్‌లోని కట్నీ వద్ద ప్లాంట్స్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ కేంద్రాల్లో డ్రై సిమెంట్ పుట్టీ, టెక్స్చర్స్, ప్రైమర్స్, ఎమల్షన్స్ తయారు చేస్తారు.
మొదటి దశలో ఒక్కొక్క ప్లాంటు వార్షిక సామర్థ్యం 30,000 మెట్రిక్ టన్నులని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ అయినటువంటి ఆకూరి శ్రీనివాస్ రెడ్డి( Akuri Srinivas Reddy ) తెలిపారు.ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ….“తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా 26,065 పాఠశాలలకు రంగులు వేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టడం జరిగింది.2023లో దేశవ్యాప్తంగా రిటైల్‌లో దీనిని విస్తరిస్తాం.విక్రయ కేంద్రాల్లో కలర్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తాం.
వీటితో వినియోగదారు కోరుకున్న రంగును వెంటనే అందిస్తాము” అని అన్నారు.
ఈ క్రమంలో ఈ 2022-23లో 100 శాతం వృద్ధి సాధించి తీరుతామని అన్నారు.అంతేకాకుండా ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు( Techno Paints Plants ) చేయడం ద్వారా అనేకమంది స్థానికులను వుద్యోగావకాశాలు దొరుకుతాయని అన్నారు.ఈ నేపథ్యంలో ఓ మీడియా విలేఖరి ఈ ప్లాంట్స్ లో చదువులేనివారికి కూడా అవకాశాలు ఉంటాయా? అని అడగడంతో… తప్పకుండా అలాంటివారికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని, అందుకే స్థానికంగా ఈ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.రాబోయే రోజుల్లో మరిన్ని ప్లాంట్స్ విస్తరిస్తామని ఈ సందర్భంగా మాటిచ్చారు.