ఆ విషయంలో జనాలకు నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్న నారా లోకేష్‌

నారా లోకేష్ యువ గళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) జోరుగా సాగుతోంది.తెలుగు దేశం పార్టీ కార్యకర్తల్లో మరియు నాయకులు ధైర్యాన్ని నూరి పోస్తూ ప్రజల్లో తెలుగు దేశం పార్టీ పై నమ్మకాన్ని కలిగిస్తూ లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది.

 Tdp Leader Nara Lokesh Interesting Comments On Yuvagalam Padayatra,yuvagalam Pad-TeluguStop.com

పోలవరం ప్రాజెక్టు( Polavaram project ) పూర్తి చేయాలన్నా… మధ్యలో ఆగి పోయిన అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్నా.రాష్ట్రం అభివృద్ధిలో మళ్లీ ముందుకు సాగాలన్నా.

రాష్ట్రానికి ప్రాజెక్ట్స్ రావాలన్నా.కచ్చితంగా తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలంటూ నారా లోకేష్ ప్రజల వద్ద పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాడు.

Telugu Balakrishna, Chandrababu, Lokesh, Tdp, Ys Jagan-Politics

జగన్ పరిపాలన వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో లోకేష్ సఫలం అవుతున్నాడని తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు దేశం పార్టీ( Telugu Desam Party ) పై జనాల్లో నమ్మకాన్ని కలిగించే విధంగా లోకేష్ పాద యాత్రలో మాట్లాడుతున్నాడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పాదయాత్ర చేశాం అంటే చేశాం అన్నట్లుగా కాకుండా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించి వారికి తగ్గట్లుగా మాట్లాడుతున్న లోకేష్( Nara Lokesh )యొక్క రాజకీయ చతురతను కొందరు ప్రశంసిస్తున్నారు.తెలుగు దేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు రాబోతున్నాం అంటూ ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు.

Telugu Balakrishna, Chandrababu, Lokesh, Tdp, Ys Jagan-Politics

రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వం( YS Jagan Government )పై వ్యతిరేకత ఉంది అంటూ లోకేష్ గట్టిగా వాదిస్తున్న ఈ నేపథ్యంలో జనాల్లో ఎక్కువ శాతం తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా మూడ్‌ చేంజ్ అవుతుంది అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటున్నారు.వచ్చే సంవత్సరం జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా తెలుగు దేశం పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్మకాన్ని ఆ పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.మరి లోకేష్ పాదయాత్ర ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube