బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda Sai Srinivas ) హీరో గా రూపొందిన ఛత్రపతి( Chhatrapati ) చిత్రం అతి త్వరలో హిందీ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.తెలుగు లో రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరో గా రూపొందిన ఛత్రపతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
కనుక హిందీలో కూడా ఛత్రపతి భారీ విజయాన్ని నమోదు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ అంత అభిప్రాయం చేస్తున్నారు.కానీ తెలుగు ప్రేక్షకులకు ఉన్నంత నమ్మకం హిందీ ప్రేక్షకుల్లో కనిపించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే హిందీ లో ఈ సినిమా కు ఏ మాత్రం హైప్ క్రియేట్ కాలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
హిందీ లో ఈ సినిమా ను ప్రమోట్ చేయడానికి కచ్చితం గా స్టార్ హీరో లేదా ఫిలిం మేకర్ ని పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.రాజమౌళి లేదా అంతకు మించిన వారు ఎవరైనా వచ్చి ఛత్రపతి సినిమా కు ప్రచారం చేస్తే తప్పితే ఈ సినిమా ను జనాలు పట్టించుకునే అవకాశాలు లేదు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.ఛత్రపతి సినిమా ను హిందీలోనే కాకుండా మరికొన్ని భాషల్లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు లో ఛత్రపతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది కనుక హిందీలో మినిమం 250 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేయాలని అంతా భావిస్తున్నారు.మరి ఆ స్థాయి కలెక్షన్స్ సినిమా నమోదు చేస్తుందా లేదా అని తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
చత్రపతి సినిమా కంటే ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏ ఒక్క సినిమాని కూడా హిందీ లో చేయలేదు, కనుక ఈ సినిమాతోనే హిందీ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.మరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది చూడాలి.