సంగీత దర్శకుడు చక్రి( chakri ) మరణించి దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయింది.కానీ చనిపోయాక అయన ఇంటి సభ్యులు రచ్చ కెక్కి గొడవ పడిన విధానం చక్రి అభిమానులను ఎంతగానో బాధించింది.
ఒక గొప్ప సంగీత దర్శకుడిని ఈ లోకం కోల్పోయింది.అదే స్థాయిలో కుటుంబ కలహాలు మిన్నంటాయి.
చక్రి బ్రతికి ఉన్నంత కాలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోయింది.కానీ అయన పోయాక ఇంటిని చూసే పెద్ద దిక్కు లేకపోవడం తో అస్సలు సమస్య మొదలయ్యింది.
చక్రి తండ్రి చాల ఏళ్ళ క్రితమే మరణించగా, తల్లి వృద్ధురాలు, తమ్ముడు దివ్యానంగుడు.సోదరీమణులు వివాహాలు జరిగి వారి వారి జీవితాల్లో సెటిల్ అయ్యారు.
అయితే ఎటొచ్చి చక్రి భార్య శ్రావణి( Shravani ), తమ్ముడు మరియు తల్లి మధ్య గొడవలు బాగా పెరిగిపోయాయి.అయన సంపాదించినా ఆస్థి కోసం రోడ్డుకెక్కారు.చివరికి చక్రి భార్య శ్రావణి తనకు అందిన కాడికి మూటగట్టుకొని అమెరికా వెళ్ళిపోయి మరొక వివాహం చేసుకొని సెటిల్ అయిపొయింది.ఇప్పుడు వయసు మీద పడిన తల్లిని, అవిటి వాడైనా తమ్ముడ్ని చూసే వారు లేకపోయారు.
పైగా చక్రి తమ్ముడు మాధవ్ ( Madhav )సైతం సంగీత పరిజ్ఞానం కలిగి ఉన్నవాడు కావడం తో చక్రి యొక్క రికార్డింగ్ స్టూడియో లో అయినా సినిమాలకు సంగీతం చేసి ఎంతో కొంత సంపాదించాలి అనుకున్నాడు.
అయితే చాల మందికి తెలియని విషయం ఏమిటి అంటే చక్రి చనిపోవడానికి చాల రోజుల ముందు నుంచి సంగీతం చేస్తున్నాడు కాబట్టి ఎన్నో పాటలను ఆలా రికార్డు చేసి పెట్టుకున్నాడు.అలా ఏ చిత్రానికి ఇవ్వకుండా దాచి పెట్టిన పాటలు వందకు పైగానే ఉండేవట.కానీ చక్రి కుటుంబం బాధలో ఉన్న సమయంలో ఆ రికార్డింగ్ స్టూడియో లో ఉన్న సోఫాలు, వస్తువులు బయట పెట్టి రికార్డింగ్ స్టూడియోని గుర్తు తెలియని వ్యక్తులు సిసి కెమెరాలు ఆపేసి మరి తగలబెట్టారు.
ఎవరు ఈ ఘాతుకం చేసారో తెలియలేదు కానీ చక్రి భార్య మాత్రం చక్రి తమ్ముడి పై కేసు పెట్టగ, సదరు సోదరుడు చక్రి భార్య పై కేసు పెట్టాడు.ఈ వ్యవహారం లో చక్రి యొక్క నిజమైన ఆస్థి మాత్రం కాలిపోయింది.