జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హఠాత్తుగా ఢిల్లీ ( Delhi ) పయనమయ్యారు.బిజెపి అధిష్టానం( BJP ) పిలుపుమేరకు ఢిల్లీ వెళ్ళిన పవన్ అక్కడ రాష్ట్ర హోం మంత్రి అమిత్ షా తో( Amith Sha ) పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నట్లు సమాచారం.
జనసేన బిజెపి మధ్య ఉన్న విభేదాలు, ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన బిజెపికి హ్యాండ్ ఇవ్వడానికి గల కారణాలను తెలుసుకునే పనిలో భాగంగానే పవన్ ను బిజేపి అధిష్టానం పిలిపించిందని రాజకీయ వర్గాల అంచనా .ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన ఓట్లు మాకు పడలేదని వైసీపీకి వ్యతిరేకంగా మాత్రమే ఓటు వేయమని జనసేనా ని పిలుపునిచ్చారని జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లే అంటూ బిజెపి అభ్యర్థి మాధవ్ విమర్శించిన విషయం తెలిసిందే ….ఆ విషయాలన్నీ ఆయన అధిష్టానానికి నివేదించారని పొత్తుపై ఇరు పార్టీలలో ఉన్న అపోహలను తొలగించి ఒక క్లారిటీ ఇవ్వడానికే పవన్ ను పిలిపించాలని
ఒక వర్గం అంటుండగా జనసేన -బిజెపి- టిడిపి కూటమికి అనుకూలంగా ఉండే వాతావరణన్ని సృష్టించడానికి పవన్ పనుగట్టుకుని ఢిల్లీ వెళ్లారని మరో వర్గం అంచనా వేస్తుంది….జనసేన పై పొత్తుకు సుముఖంగా ఉన్న బిజెపి అధిష్టానం టిడిపి తో పొత్తుకు మాత్రం ససేమిరా అంటుంది….ఆ పార్టీతో గత అనుభవాలు దృష్ట్యా టిడిపికి దూరంగా ఉండాలని ,అన్ని విషయాల లోనూ అనుకూలంగా ఉంటున్న జగన్ పార్టీతో కలసి నడవాలని ఢిల్లీ పెద్దలు అనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి తన పార్టీకి వచ్చే ఎన్నికలలో
పరోక్ష మద్దతు ఇచ్చేలాగా జగన్ చక్రం తిప్పారని ఇక పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నం చేసిన కూడా బిజెపి అధిష్టానం మద్దతు జగన్ పార్టీకే ఉంటుందని వైసిపి శ్రేణులు వాక్యానిస్తున్నాయి ఏది ఏమైనా హఠాత్తుగా ఢిల్లీ ప్రయాణం సాధారణ పరిణామం కాదని మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయo రసవత్తరం గా మారిపోతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ….బిజెపితో కలిసి నడవాలో లేక టిడిపి తో కలిసి పొత్తుపై ముందుకు వెళ్లాలా అన్న క్లారిటీ కూడా ఈ భేటీ తర్వాత జనసేనలో వస్తుందని కేంద్ర ప్రభుత్వం జగన్ పార్టీకి అనుకూలంగా ఉందన్న అంచనాలు కనుక వస్తే ఇక తాడోపేడో తేల్చుకోవాలని పవని ఆలోచిస్తున్నారంటూ జన సైనికులు అంటున్నారు.ముందు ముందు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి
.