ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ క్రికెట్ జట్టు అంటే అది ధోనీ ( Dhoni )కెప్టెన్గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ అని అందరికీ తెలిసిందే.ఎందుకంటే ఐపీఎల్ లో 13 సీజన్లు పాల్గొని ఏకంగా 11 సార్లు ప్లే ఆఫ్ కు చేరి నాలుగు సార్లు టైటిల్ దక్కించుకుంది.2016, 2017 లో నిషేధం కారణంగా సీజన్లో ఆడలేదు.2020, 2022 లలో రెండుసార్లు లీగ్ స్టేజ్ నుండి చెన్నై వెనుదిరిగింది.
ఇక ఐపీఎల్ చరిత్రలో పరమ చెత్త జట్టుగా పంజాబ్ కింగ్స్( Punjab Kings ) నిలిచింది.పంజాబ్ జట్టు ఫ్రాంచైజీ ఎన్నో స్ట్రాటజీలు, విశ్వ ప్రయత్నాలు చేస్తూ ప్రతి సీజన్ కు కెప్టెన్ ని మారుస్తూ వస్తున్న ఎటువంటి ఫలితం లేదు.ఐపీఎల్ చరిత్రలో ఏకంగా 13 సార్లు కెప్టెన్లను మార్చిన జట్టుగా పంజాబ్ జట్టు రికార్డు సృష్టించింది.ఇక 14వ కెప్టెన్గా శిఖర్ ధావన్( Shikhar Dhawan ) సారథ్యం వహిస్తున్నాడు.
2008 నుండి పంజాబ్ జట్టుకు కెప్టెన్లుగా యువరాజ్ సింగ్, కుమార సంగాక్కార, జయవర్ధనే, గిల్ క్రిస్ట్, డేవిడ్ హస్సీ, జార్జ్ బెయిలీ, సెహ్వగ్, డేవిడ్ మిల్లర్, మురళి విజయ్, మ్యాక్స్ వెల్, అశ్విన్, కేఎల్ రాహుల్( Ashwin, KL Rahul ), మయాంక్ అగర్వాల్ లు సారథ్యం వహించారు.యువరాజ్ సారథ్యం వహించిన తొలి ఐపీఎల్ సీజన్లో పంజాబ్ సెమిస్ కు చేరింది.2014లో జార్జ్ బెయిలీ కెప్టెన్సీలో ఫైనల్ వరకు వెళ్ళింది.చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఈ రెండు మాత్రమే.
ఇక మిగిలిన సీజన్లో లీగ్ పాయింట్ల టేబుల్ లో ఆఖరి స్థానంలో నిలుస్తూ వచ్చింది.తాజాగా 2023లో పంజాబ్ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్ గా సారథ్యం వహిస్తున్నాడు.
ఇటీవల జరిగిన కలకత్తా- పంజాబ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్లో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది పంజాబ్ జట్టు.ఇక శిఖర్ ధావన్ ఈ సీజన్లో పంజాబ్ జట్టును ఎక్కడి వరకు తీసుకెళ్తాడో చూడాలి.