అప్పుడప్పుడు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ల ఫేస్ లలో కాస్త మార్పులు కనిపిస్తూ ఉంటాయి.ఒక్కొక్కసారి మేకప్ వల్ల అందంగా కనిపించకుండా పోతారు.
కారణం ఏంటో తెలియదు కానీ మేకప్ వల్ల కూడా వారి అందాలు కోల్పోతారు.అయితే ఇప్పుడు తాజాగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) కూడా అలాగే కనిపించింది.
మొన్నటి వరకు అందంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ముఖంలో కాస్త మార్పులు కనిపించినట్టు కనిపించాయి.ప్రస్తుతం ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.
ఇంతకు తను ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందాలతో అందర్నీ తన వైపుకు మలుపుకుంది కాజల్ అగర్వాల్.
అతి తక్కువ సమయంలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అలా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
లక్ష్మి కళ్యాణం సినిమాతో తొలిసారిగా కాజల్ తెలుగు తెరకు పరిచయం అయింది.
ఆ తరువాత మెగా హీరో రామ్ చరణ్( Ram Charan ) నటించిన మగధీర సినిమాలో( movie Magadheera ) హీరోయిన్గా నటించినది.ఇక ఈ సినిమాతో తను మంచి సక్సెస్ అందుకుంది.
నిజానికి కాజల్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే.తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ స్టార్ హోదాకు చేరుకుంది.
మంచి హోదాలో ఉన్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లూ( gautam kitchlu )ను ప్రేమ పెళ్లి చేసుకుంది.అప్పటి నుంచి ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా టూర్స్ ప్లాన్స్ వేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటూ తన భర్త తో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసేది.ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
కొడుకు పుట్టాక కాజల్ ను చూసి తెలుగు ప్రేక్షకులు చాలా మురిసిపోయారు.ఇక మళ్లీ మునుపటిలా కనిపించడానికి బాగా వర్క్ అవుట్ లు కూడా చేస్తుంది.ఇక తన వర్కౌట్లు చేసే వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తూ ఉంటుంది.ఇక తన బాబు ఫోటోలు కూడా బాగా పంచుకుంటూ.చాలా వరకు తన బాబు ఫేస్ చూడనివ్వకుండా కాజల్ జాగ్రత్త పడుతుంది.ఈ విషయంలో మాత్రం ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారని చెప్పవచ్చు.
ఇక ఇప్పుడు కూడా బాగా ఫోటో షూట్లు చేయించుకుంటూ వాటిని కూడా పంచుకుంటూ ఉంది.ఈ మధ్యనే ఓ సినిమాలో కూడా అవకాశం అందుకుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటోషూట్ లు చేయించుకోక వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అయితే ఆ ఫోటోలో ఎందుకో తను అంత అందంగా కనిపించలేదు.
చాలా వరకు తన ఫేస్ లో చాలా మార్పులు వచ్చినట్లు కనిపించాయి.అసలు మునుపట్టి లుక్ లేనట్లుగా అనిపించింది.
ఇక ఆ ఫోటోలు చూసి ప్రతి ఒక్కరు తన ఫేస్ గురించే కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.