దండోరా వేసి బలగం సినిమా ప్రదర్శన... పోలీసులకు ఫిర్యాదు చేసిన దిల్ రాజు!

దిల్ రాజు నిర్మాణంలో జబర్దస్త్ కమెడియన్ వేణు( Venu ) దర్శకత్వంలో ప్రియదర్శి( Priyadarshi ) కావ్య కళ్యాణ్ రామ్ ( Kavya Kalyan Ram )జంటగా నటించిన చిత్రం బలగం( Balagam ).ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకుంది.

 Dil Raju Who Complained To The Police After Dandora Veki Balagam Movie Screening-TeluguStop.com

ఇక ఈ సినిమా గురించి తెలంగాణలో మారుమూల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా దిల్ రాజు( Dil Raju )కు భారీ స్థాయిలో లాభాలను కూడా తీసుకొస్తుంది.

Telugu Amazon, Balagam, Dil Raju, Nizamabad, Priyadarshi, Venu-Movie

తెలంగాణ భాష, యాస, పల్లెటూరి సంప్రదాయాలు, మనుషుల మధ్య బంధాలని వేణు కళ్ళకి కట్టినట్లు చూపించారు.ఇక ఈ సినిమా ప్రభావం తెలంగాణ ప్రజలపై ఎంతగా పడింది అంటే చిన్న చిన్న గ్రామాలలో కూడా దండోరా వేసి ఊరు మొత్తం ఒకే చోట కూర్చొని ఉచితంగా ఈ సినిమాని ప్రదర్శిస్తూ ప్రజలకు చూపిస్తున్నారు.అయితే ఇలా ఊరికి మొత్తానికి ఈ సినిమాని ఉచితంగా చూపించడంతో ఈ విషయం కాస్త వివాదంగా మారింది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్( Amazon ) కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలలో ప్రసారం అవుతుంది.

Telugu Amazon, Balagam, Dil Raju, Nizamabad, Priyadarshi, Venu-Movie

ఇలా ఒకవైపు డిజిటల్ మీడియాలో ప్రసారమవుతూనే మరోవైపు థియేటర్లలో కూడా బలగం సినిమా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది.ఈ క్రమంలోనే పల్లెల్లో ఇలా ఉచితంగా ప్రదర్శనలు వేయడంతో తమకు భారీ స్థాయిలో నష్టాలు వస్తాయంటూ దిల్ రాజు ఈ వ్యవహారం పై అసహనం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.గ్రామాలలో ఉచితంగా ప్రదర్శితమవుతున్నటువంటి బలగం సినిమా అక్రమ ప్రదర్శనలను అడ్డుకోవాలి అంటూ ఈయన నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇలా గ్రామ ప్రజలకు ఈ సినిమాని అక్రమంగా ప్రదర్శిస్తున్న వారి పట్ల చర్యలు తీసుకోవాలని ఈయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరి ఈ ఫిర్యాదు పై పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube