దండోరా వేసి బలగం సినిమా ప్రదర్శన… పోలీసులకు ఫిర్యాదు చేసిన దిల్ రాజు!

దిల్ రాజు నిర్మాణంలో జబర్దస్త్ కమెడియన్ వేణు( Venu ) దర్శకత్వంలో ప్రియదర్శి( Priyadarshi ) కావ్య కళ్యాణ్ రామ్ ( Kavya Kalyan Ram )జంటగా నటించిన చిత్రం బలగం( Balagam ).

ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా గురించి తెలంగాణలో మారుమూల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా దిల్ రాజు( Dil Raju )కు భారీ స్థాయిలో లాభాలను కూడా తీసుకొస్తుంది.

"""/" / తెలంగాణ భాష, యాస, పల్లెటూరి సంప్రదాయాలు, మనుషుల మధ్య బంధాలని వేణు కళ్ళకి కట్టినట్లు చూపించారు.

ఇక ఈ సినిమా ప్రభావం తెలంగాణ ప్రజలపై ఎంతగా పడింది అంటే చిన్న చిన్న గ్రామాలలో కూడా దండోరా వేసి ఊరు మొత్తం ఒకే చోట కూర్చొని ఉచితంగా ఈ సినిమాని ప్రదర్శిస్తూ ప్రజలకు చూపిస్తున్నారు.

అయితే ఇలా ఊరికి మొత్తానికి ఈ సినిమాని ఉచితంగా చూపించడంతో ఈ విషయం కాస్త వివాదంగా మారింది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్( Amazon ) కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలలో ప్రసారం అవుతుంది. """/" / ఇలా ఒకవైపు డిజిటల్ మీడియాలో ప్రసారమవుతూనే మరోవైపు థియేటర్లలో కూడా బలగం సినిమా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది.

ఈ క్రమంలోనే పల్లెల్లో ఇలా ఉచితంగా ప్రదర్శనలు వేయడంతో తమకు భారీ స్థాయిలో నష్టాలు వస్తాయంటూ దిల్ రాజు ఈ వ్యవహారం పై అసహనం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గ్రామాలలో ఉచితంగా ప్రదర్శితమవుతున్నటువంటి బలగం సినిమా అక్రమ ప్రదర్శనలను అడ్డుకోవాలి అంటూ ఈయన నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇలా గ్రామ ప్రజలకు ఈ సినిమాని అక్రమంగా ప్రదర్శిస్తున్న వారి పట్ల చర్యలు తీసుకోవాలని ఈయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరి ఈ ఫిర్యాదు పై పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

ఉసిరి గింజ‌లను పారేస్తున్నారా.. వాటి ప్ర‌యోజ‌నాలు తెలిస్తే షాకైపోతారు!