హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే తిరుగులేని పాపులారిటీ సంపాదించింది.2021 “పుష్ప”( Pushpa ) సినిమాతో ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఆ సినిమాలో “నా సామి.బంగారు స్వామి” అనే సాంగ్ లో రష్మిక వేసిన స్టెప్ లు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.“పుష్ప” సినిమాతో తిరుగులేని క్రేజ్ నార్త్ మొదలుకొని సౌత్ వరకు దక్కించుకుంది.
ఇదిలా ఉంటే రేపటినుండి ఐపీఎల్ టోర్నీ( IPL Tournament ) స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే.దాదాపు పది టీమ్స్ టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి.ఈ క్రమంలో ఈసారి ఐపీఎల్ ఘనంగా నిర్వహించడానికి బీసీసీఐ( BCCI ) ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.దీనిలో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా రష్మిక మందన, తమన్నా( Tamannaah ) ఇద్దరూ లైవ్ పెర్ఫార్మన్స్ డాన్స్ చేయడానికి సిద్ధమయ్యారు.
ఇందుకోసం ఇప్పటికే రష్మిక.అహ్మదాబాద్( Ahmedabad ) కి చేరుకోవడం జరిగింది.
ఈ స్టేడియంలోనే ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి.మొదటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై( Gujarat Vs Chennai ) జట్లు తలపడుతున్నాయి.