ఐపీఎల్ సీజన్-16 మరో వారం రోజుల్లో మొదలవుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక క్రికెటర్లు ప్రాక్టీస్ కోసం ఫ్రాంచైజీల ట్రైనింగ్ క్యాంపులకు చేరుకుంటున్నారు.
మార్చ్ 31 అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవ్వనుంది.
గతంలో కంటే ఈ ఏడాది క్రికెట్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు వేలంలో కోట్లు ఖర్చు చేశాయి.ఈ ఐపీఎల్ సీజన్ -16లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ను రూ.18.5 కోట్లు ధర పలికి టాప్ వన్ స్థానంలో నిలిచాడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఈ సీజన్లో ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఇక టాప్ 2 విషయానికి వస్తే కామెరున్ గ్రీన్ ను రూ.17.5 కోట్లు వేలంలో ఖర్చుపెట్టి ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.
పోలార్డ్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం ముంబై ఇండియన్స్ కామెరూన్ గ్రీన్ ను కొనుగోలు చేసింది.తర్వాత స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు.రూ.17 కోట్లు వేలంలో ఖర్చు చేసి లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.తర్వాత స్థానంలో బెన్స్ స్టోక్స్ ఉన్నాడు.రూ.16.5 కోట్లు వేలంలో ఖర్చుపెట్టి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత జట్టుకు ఇతనే కెప్టెన్ గా బాధ్యతలు వివరించే అవకాశాలు ఉన్నాయి.
తర్వాత జాబితాలో రోహిత్ శర్మ కొసం రూ.16 కోట్లు ఖర్చు చేసింది ముంబై ఇండియన్స్.రవీంద్ర జడేజా కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ.16 కోట్లు ఖర్చు చేసింది.ఆ తర్వాత జాబితాలో రిషబ్ పంత్ రూ.16 కోట్లు, ఇషాన్ కిషన్ కు రూ.15 కోట్లు, విరాట్ కోహ్లీ రూ.15 కోట్లు, మహేంద్రసింగ్ ధోని రూ.12 కోట్లతో ఉన్నారు.