వారంలో ఒక్కసారి ఈ విధంగా షాంపూ చేసుకుంటే మీ జుట్టు సమస్యలన్నీ పరార్!

ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి, రసాయనాలు అధికంగా ఉండే షాంపూ వాడటం, రెగ్యులర్ గా తల స్నానం చేయడం తదితర కారణాల వల్ల జుట్టు రాలడం( Hair problems ), చిట్లడం, పలుచగా మారడం, చుండ్రు, కురులు పొడిబారడం తదితర సమస్యలన్నీ ఇబ్బంది పెడుతుంటాయి.వీటిని నివారించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.

 If You Shampoo In This Way, All Your Hair Problems Will Go Away! Shampooing, Sha-TeluguStop.com

అయితే ఇకపై టెన్షన్ వద్దు.ఇప్పుడు చెప్పబోయే విధంగా వారానికి ఒక్కసారి షాంపూ చేసుకుంటే మీ జుట్టు సమస్యలన్నీ పరార్ అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా షాంపూ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కలబంద ఆకు( Aloe vera ) తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, మూడు రెబ్బల వేపాకు మరియు కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసి కనీసం ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూను మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో ఒక్కసారి ఈ విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.

కుదుళ్లు బలంగా దృఢంగా మారతాయి.చుండ్రు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.జుట్టు స్మూత్ గా, షైనీగా మారుతుంది.చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.మరియు పలుచగా ఉన్న జుట్టు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.కాబట్టి పొడవాటి ఒత్తైన జుట్టును కావాలని కోరుకునే వారు, చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు, కురులు స్మూత్ గా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube