హీరో వెంకటేష్ తన కెరీర్ లో సాధించిన ఆల్ టైం రికార్డులు ఇవే..!

దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన వెంకటేష్.వరుస విజయాలతో విక్టరీ వెంకటేష్ గా మారిపోయాడు.

 Hero Venkatesh All Time Records In Tollywood, Hero Venkatesh,venaktesh Hit Movie-TeluguStop.com

తనను నటించిన ఎక్కువ సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి.వివాదాలకు దూరంగా ఉండే వెంకటేష్.

ఫ్యామిలీ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.వెంకటేష్ ను విక్టరీ వెంకటేష్ గా మార్చిన సంచలన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

కలిసుందాం…రా

Telugu Chanti, Venkatesh, Venkateshtime, Kalisundam Raa, Venaktesh, Venkatesh Li

2000 సంవత్సరంలో ఈ సినిమా విడుదల అయ్యింది.ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ కుటుంబ కథాచిత్రం.వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు దక్కించుకుంది.రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో వంద రోజులు ఆడింది.

ప్రేమించుకుందాం రా

Telugu Chanti, Venkatesh, Venkateshtime, Kalisundam Raa, Venaktesh, Venkatesh Li

1997 వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమా మంచి విజయాన్ని సాధించింది. 50కి పైగా కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.మంచి వసూళ్లను రాబట్టింది.

జయం మనదేరా

Telugu Chanti, Venkatesh, Venkateshtime, Kalisundam Raa, Venaktesh, Venkatesh Li

100 కు పైగా సెంటర్లలో 50 రోజులు ఆడిన తొలి సినిమా జయం మనదేరా రికార్డు సాధించింది.భారీగా గ్రాస్ సాధించింది.

చంటి

Telugu Chanti, Venkatesh, Venkateshtime, Kalisundam Raa, Venaktesh, Venkatesh Li

తెలుగు సినిమా పరిశ్రమలో 9 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన తొలి సినిమా చంటి.వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం కలిగించింది.

అటు ఆల్ టైం టాప్ 10 తెలుగు సినిమాలలో వెంకటేష్ నటించిన సినిమాలే 5 ఉండటం విశేషం.అందులో కలిసుందాం రా, రాజా, జయం మనదేరా, సూర్యవంశం, ప్రేమించుకుందాం రా సినిమాలున్నాయి.

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన కొండవీటి సింహం మూవీ… 1981 లో విడుదలై 31 కేంద్రాల్లో వంద రోజులు ఆడితే… ఆ రికార్డ్ ని 1992లో వెంకటేష్ తుడిచి వేశాడు.చంటి 33 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.

అటు ఒకే ఏరియాలో ఒకే థియేటర్ లో వెంకటేష్ కు చెందిన 50 సినిమాలు విడుదలై 50 రోజులు ఆడటం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube