రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల బిజెపి మండల మహిళ మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ ప్రెస్ నోట్ లో ఘాటుగా విమర్శించారు.ముఖ్యమంత్రి బిడ్డ ఒకతే మహిళనా? తెలంగాణ ఆడబిడ్డలు మహిళలు కాదా? మహిళా సర్పంచులపై లైంగిక దాడులు బిఆరెస్ కు చెందిన ఎమ్మెల్యే నే వేధించిన మాట నిజం కాదా? మహిళా గవర్నర్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోలేరు ఎందుకు? గిరిజన జాతికి చెందిన మెడికో విద్యార్థిని ప్రీతి లైంగిక దాడులకు గురై చనిపోయింది నిజం కాదా?
అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది మహిళ ఎంపీపీఅయి ఉండి బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని సూటిగా ప్రశ్నించారు.తెలంగాణ జాగృతి పేరు చెప్పి ఢిల్లీ లిక్కర్ దందా చేసి అడ్డంగా దొరికిపోయి తెలంగాణ ఆడపడుచుల పరువు తీసిన మీ ఎమ్మెల్సీ కవిత ను ఏమని సంబోధించాలి.రాబోయే ఎన్నికల్లో మీ పార్టీని బొంద పెట్టడం ఖాయమని తెలంగాణ ప్రజానీకం అంతా చూస్తుందని ఓట్లతో మీకు బుద్ధి చెబుతామని తీవ్రంగా హెచ్చరించారు.