నాగార్జున కొత్త సినిమా ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. సక్సెస్ ధమాకా సాధించేనా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొన్నాళ్లుగా కెరియర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు.ఆయన హీరో గా నటించి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది ఘోస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.

 Nagarjuna Prasanna Kumar Bejawada Movie Latest Update , Nagarjuna, Prasanna Kuma-TeluguStop.com

ఈ వయసు లో కూడా చాలా కష్టపడి సినిమా ను చేసిన నాగార్జున కు నిరాశ మిగలడం అభిమానులకు ఆవేదన కలిగించింది.ఆ సినిమా ఫెయిల్యూర్ తో కాస్త గ్యాప్ తీసుకున్న నాగార్జున ఇప్పటికే ధమాకా రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వం లో కొత్త సినిమా ను మొదలు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

తన కెరీర్ లో ఎంతో మంది కొత్త దర్శకులతో పని చేసిన అనుభవం ఉన్న నాగార్జున ఈసారి ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.ఇప్పటి వరకు సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

అయినా కూడా చిత్రీకరణ శరణ వేగంగా జరుగుతోంది.

విశ్వసనీయంగా అందుకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ శివారులో ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్‌ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారట.అంతే కాకుండా ఉగాది కి ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారని సమాచారం అందుతుంది.నాగార్జున తో విభిన్నమైన కాన్సెప్ట్ తీసుకొని దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ ఒక కమర్షియల్ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ధమాకా సినిమా సక్సెస్ క్రెడిట్ సొంతం చేసుకున్న ప్రసన్న కుమార్ బెజవాడ అదే స్థాయిలో నాగార్జున కి కూడా ఒక మంచి సూపర్ హిట్ అందివ్వాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.భారీ గా ఖర్చు చేయకుండా మీడియం బడ్జెట్ తో రూపొందుతున్న ఈ నాగార్జున సినిమా ఇదే సంవత్సరం లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

నాగార్జున కు ప్రయోగాలు చేయడం అంటే మహా మక్కువ, ఈ సినిమా ఆయన కు ప్రయోగాత్మక సినిమా అవుతుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube