తన రాజకీయ భవిష్యత్తు ఎవరు నిర్ణయిస్తారో చెప్పిన జేడీ !

జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన వివి లక్ష్మీనారాయణ అప్పట్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టారు.2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా జనసేన పార్టీ నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓటమి చెందారు.అయినా రాజకీయాలపై ఉన్న ఆసక్తితో విశాఖలోనే గత కొంతకాలంగా అనేక రాజకీయ సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.

 Jedi Said Who Will Decide His Political Future ,vv Lakshminarayana, Jd Lakshmina-TeluguStop.com

2024 లోను విశాఖ నుంచి పోటీ చేసేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నాలు చేస్తున్నారు.ఏ పార్టీలోనైనా చేరినా,  చేరకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా అయిన పోటీ చేసేందుకు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నా.లక్ష్మీనారాయణ అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు.

తాజాగా తన రాజకీయ భవిష్యత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఏదైనా పార్టీ తన ఆలోచన విధానం నచ్చి వస్తే వారితో చర్చలు నిర్వహిస్తానని తెలిపారు.

Telugu Aamadmi, Janasena, Ysrcp-Politics

మన ఎన్నికల వ్యవస్థలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం కూడా ఉందని లక్ష్మీనారాయణ అన్నారు.  తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.ఉన్నత విద్యావంతుడుగా,  నిజాయితీగల అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లక్ష్మీనారాయణ రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

గతంలోనే లక్ష్మీనారాయణ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని , ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగింది.అయినా లక్ష్మీనారాయణ సైలెంట్ గానే ఉన్నారు.

Telugu Aamadmi, Janasena, Ysrcp-Politics

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించిన బి.ఆర్.ఎస్ పార్టీలో చేరుతారని , ఆ పార్టీలో కీలకంగా మారుతారని ప్రచారం జరిగినా,  లక్ష్మీనారాయణ స్పందించలేదు.ఇక జనసేనలో మళ్లీ చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా,  లక్ష్మీనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

స్వతంత్రంగా పోటీ చేసేందుకూ ఆయన సిద్ధంగానే ఉన్నట్టుగా చెబుతూనే… ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube