ప్రతి హీరోకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి.ఆ సెంటిమెంట్లలో కొన్ని సెంటిమెంట్లు లక్కీ సెంటిమెంట్లు కావడంతో పాటు విజయాలను అందిస్తుంటాయి.
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబుకు కూడా ఆగష్టు నెల లక్కీ మంత్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆగష్టులో రిలీజ్ చేస్తే మహేష్ బాబు సినిమా హిట్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
మహేష్ గుణశేఖర్ కాంబినేషన్ అర్జున్ అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమా 2004 సంవత్సరం ఆగష్టు 18వ తేదీన థియేటర్లలో విడుదలైంది.బాక్సాఫీస్ వద్ద అర్జున్ సినిమా అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.
అన్నాచెల్లెళ్ల కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ అభిమానులకు మాత్రం ఎంతగానో నచ్చేసింది.మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు సినిమా తెరకెక్కగా ఈ సినిమా 2005 సంవత్సరం ఆగష్టు 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది.
వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా తెగ నచ్చేసింది.ఈ సినిమాలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.ఆ తర్వాత మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా కూడా 2015 సంవత్సరం ఆగష్టు నెల 7వ తేదీన థియేటర్లలో రిలీజైంది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాతో కొరటాల శివ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ చేరింది.ఈ సెంటిమెంట్లను రిపీట్ చేస్తూ ఈ ఏడాది ఆగష్టులో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ విడుదల కానుంది.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.