స్టార్ హీరోయిన్ నయనతార సక్సెస్ రేట్ ఎక్కువే అయినా వ్యక్తిగత జీవితంలో ఆమె ఎదుర్కొన్న వివాదాలు అన్నీఇన్నీ కావు.ప్రముఖ హీరోలతో ప్రేమాయణాల ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.
అయితే నయనతార విఘ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.నయనతార సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.
అయితే విఘ్నేష్ శివన్ కు నయనతార ఎన్నో కండీషన్లు పెట్టినట్టు తెలుస్తోంది.
ఆ షరతులకు విఘ్నేష్ శివన్ అంగీకరించడం వల్ల పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.
నయనతార క్యాస్టింగ్ కౌచ్ పై తాజాగా ఘాటుగా రియాక్ట్ అయిన నేపథ్యంలో ముగ్గురు సెలబ్రిటీల జీవితంతో నయన్ ఆడుకుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పిల్లల విషయంతో పాటు పెళ్లి తర్వాత తనకు నచ్చినట్టు జీవించేలా నయనతార కండీషన్లు పెట్టి ఆ షరతులకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకుందని బోగట్టా.
నయనతార వల్ల శింబు, ప్రభుదేవా వ్యక్తిగత కెరీర్ పరంగా తీవ్రస్థాయిలో నష్టపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి.పైకి మంచి హీరోయిన్ లా కనిపించే నయనతార నిజస్వరూపం వేరేనని సమాచారం.విఘ్నేష్ శివన్ తో జీవితం సెక్యూర్ గా ఉంటుందని భావించి అతనినే పెళ్లి చేసుకోవాలని ఆమె ఫిక్స్ అయినట్టు సమాచారం అందుతోంది.నయనతార రెమ్యునరేషన్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.
కథ నచ్చినా అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోతే నయనతార సినిమాలకు నో చెబుతారని టాక్ ఉంది.నయనతార ఈ కామెంట్ల గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.నయనతార పారితోషికం ప్రస్తుతం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.నయనతార పక్కా కమర్షియల్ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.నయనతార తమిళ సినిమాలతో బిజీగా ఉండటం గమనార్హం.తెలుగులో కొత్త ఆఫర్లు వస్తున్నా నయన్ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం అందుతోంది.