తిరుమల తిరుపతి దేవస్థానం మొబైల్ యాప్ విడుదలైంది.ఈ యాప్ ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు జియో ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
భక్తుల అవసరాలు తీర్చే విధంగా యాప్ ను జియో రూపొందించింది.ఈ యాప్ ద్వారా సేవా టికెట్ల బుకింగ్, వసతితో పాటు ఈ హుండీ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
యాప్ విడుదల అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆనంద నిలయం బంగారం తాపడం పనులు వాయిదా పడినట్లు తెలిపారు.ముందుగా ఫిబ్రవరిలో చేపట్టాలనుకున్నామన్న ఆయన గ్లోబల్ టెండర్లు పిలిచి 5, 6 నెలల్లో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.