తమిళం లో దర్శకుడిగా భారతి రాజా అంటే సినిమా కి నిఘంటువు వంటి వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయన తన కెరీర్ మొత్తంలో యాభై కంటే తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించిన రియాలిటీ కి దగ్గర గా ఉంటాయి కాబట్టి భారతి రాజా సినిమాలు విజయం సాదించేవి.
ఇక భారతి రాజా తీసిన మొదటి సినిమా 16 వాయతినిలే.ఇది తెలుగు లో శ్రీదేవి హీరోయిన్ గా 16 ఏళ్ళ వయసు పేరు తో రీమేక్ చేయబడింది.
అచ్చమైన పల్లెటూరి కథనం తో సాగిన ఈ చిత్రం భారతి రాజా కు మంచి పేరు ను మాత్రమే కాదు, బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు ని సైతం దక్కేలా చేసింది.ఇక ఈ చిత్రం తర్వాత కిజకే పోగుం రైల్ పేరుతో మరొక సినిమా తీశారు.
ఈ సినిమా తెలుగు లో తూర్పుకు వెళ్లే రైలు పేరుతో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది.ఈ సినిమా కు బెస్ట్ డైరెక్టర్ గా భారతి రాజా కు ఫిలిం ఫెర్ అవార్డు లభించింది.అయితే ఈ సినిమా కూడా పల్లెటూరు నేపథ్యంలోనే తెరకెక్కించారు భారతి రాజా.అయన ప్రకృతికి, పల్లెటూర్లకు ఇచ్చిన ప్రాధాన్యత వల్ల భారతి రాజా కేవలం పల్లెటూరు కథలను మాత్రమే తీయగలరు అనే అపవాదు మూటగట్టుకున్నారు.
అంత గొప్పగా మాడ్రన్ కథలను తీయలేరేమో అందుకే రెండు సినిమాలు కూడా ఆలా పల్లెల్లో కానిచ్చేశాడు అంటూ పలువురు విమర్శలు చేసేవారు.దాంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత భగ్గుమనే వారు.
అందులో మరి ముఖ్యంగా భారతి రాజా ప్రియ శిష్యుడు భాగ్యరాజ్ కి అయితే కోపం నషాళానికి ఎక్కేది.
అయితే ఇప్పటిలో లాగ భారతి రాజా తన అసిస్టెంట్ డైరెక్టర్స్ కి ఫ్రీడమ్ ఇవ్వకుండా తాను ఏం చెప్తే అదే తీయాలని హుకుం జారీ చేసేవారు కాదు.తన దగ్గరికి వచ్చి వారి మనోభావాలను వారికి చెప్పగల ఫ్రీడమ్ ఉండేది.అందుకే అప్పుడు బాగా వైరల్ గా మారిన ఒక సైకోపాతిక్ కిల్లర్ స్టోరీ ని తీయాలని భారతి రాజా తో భగ్య రాజ్ చెప్పడం తో సరే అని పూనుకున్నారు.
టీమ్ అంత కూడా కసిగా అప్పుడు పేపర్ లో వచ్చిన ఒక ముంబై సీరియల్ కిల్లర్ స్టోరీ ని ఇతివృత్తంగా తీసుకొని కథ డెవలప్ చేసారు.అదే సినిమా లో కమల్ హాసన్ ని హీరో గా పెట్టుకొని భారతి రాజా మూడో సినిమాగా చేయగా దాని పేరు సివప్పు రోజాక్కళ్(తెలుగులో ఎర్రగులాబీలు).