ప్రముఖ సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా స్టార్ హీరో బాలకృష్ణ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బాలయ్య నాతో మాట్లాడుతూ మీ కళ్లు, ముక్కు, నవ్వు వల్ల రాణి గెటప్ వేసినా, దేవత గెటప్ వేసినా భలే సెట్ అవుతారని చెప్పేవారని రోజా తెలిపారు.
దేవుడు మీకు అలా ఇచ్చేశారని ఆయన కామెంట్లు చేసేవారని రోజా చెప్పుకొచ్చారు.అన్ స్టాపబుల్ షోకు నాకు ఎప్పుడో ఆహ్వానం అందిందని రోజా కామెంట్లు చేశారు.
అయితే నేను ఆ షోకు వెళ్లలేదని రోజా చెప్పుకొచ్చారు.సినిమా వేరు రాజకీయాలు వేరని బాలయ్య కూడా చెబుతారని ఆమె తెలిపారు.బాలకృష్ణ గారు కూడా అదే చెబుతారని మొన్న పుట్టినరోజుకు బాలయ్య విష్ చేశారని అసెంబ్లీలో కనిపించినా కూడా బాలయ్య నాతో మాట్లాడతారని రోజా చెప్పుకొచ్చారు.పార్టీ మారడం వల్ల నేనే మొహమాటపడుతూ ఉండేదానినని ఆమె పేర్కొన్నారు.
అన్ స్టాపబుల్ షోకు నేను వెళితే దాన్ని కూడా వివాదం చేసే ఛాన్స్ అయితే ఉందని రోజా అన్నారు.
ఆ షోకు వెళ్లడానికి నాకైతే ఇబ్బంది లేదని ఆమె కామెంట్లు చేశారు.ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ షోకు వెళ్లలేదని రోజా అన్నారు.జగన్ సార్ ఎప్పుడూ షరతులు పెట్టలేదని జగన్ గారికి నాపై నమ్మకం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
నాకు ఏ పని ఇచ్చినా పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని రోజా వెల్లడించారు.జబర్దస్త్ షో వల్ల నెగిటివ్ కామెంట్లు వచ్చినా జగన్ సార్ ఏమీ అనలేదని ఆమె వెల్లడించారు.
మోదీ జగన్ తో కలిసి దిగిన పిక్ మెమరబుల్ పిక్ అని రోజా తెలిపారు.చిరంజీవి మంచి డ్యాన్సర్ అని చంద్రబాబు మంచి చీటర్ అని రోజా చెప్పుకొచ్చారు.లోకేశ్ కామెడీ పీస్ అని పవన్ కళ్యాణ్ అన్ స్టేబుల్ అని రోజా కామెంట్లు చేశారు.నేను ఆరాధించే నాయకుడు జగన్ అని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.