కాంగ్రెస్ కి మరో ఎదురు దెబ్బ..! ఆ కీలక నేత జంప్?

సీనియర్ నేత, టీపీసీసీ ప్రోగ్రాం కమిటీ చైర్‌పర్సన్ యేలేటి మహేశ్వర్ రెడ్డి పయనం ఎటు అన్న దానిపై తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది.త్వరలో ఆయన ఆ పార్టీని వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 Another Blow To Congress That Key Lead Jump , Congress, Yeleti Maheshwar Reddy,-TeluguStop.com

మహేశ్వర్ ఇటీవలి చర్యలు, మాటలు ఇప్పుడు కాంగ్రెస్ కేడర్ లో కలకలం రేపుతోంది.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని యేలేటి ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు.

రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి తిరుగుబాటు బావుటా ఎగురవేసి రేవంత్ రెడ్డి నాయకత్వం పార్టీని ఎక్కడికీ తీసుకువెళ్లడం లేదన్నారు.జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆదేశాలు జారీ చేసినా ఆయన కీలక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో పార్టీ నేతలకు భారీ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది.ఈ సమావేశానికి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.కుదరని వారు ముందస్తు అనుమతి పొందడం గాని, హాజరుకాలేకపోవడాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.అయితే యేలేటి ఒక్కరే పర్మిషన్ కోసం ఎలాంటి టెన్షన్ తీసుకోలేదు.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయన సమావేశానికి గైర్హాజరయ్యారు.

త్వరలో ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.యేలేటి ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని, ఎన్నికలకు ముందే ఆ పార్టీలో చేరే యోచనలో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.దీనికి కారణం హై కమాండ్ నుండి రేవంత్ కి ఉన్న సపోర్ట్ అని చెప్పుకుంటున్నారు.

పైగా తిరుగుబాటు బావుటా ఎగరేసిన యేలేటి ని రానున్న రోజుల్లో మరింత టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక జనవరి 18 నుంచి ఆయన తన అసెంబ్లీ నియోజకవర్గంలో యాత్ర చేపట్టాలని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.ఆదిలాబాద్ జిల్లాలో యేలేటి కి మంచి కూడా ఫాలోయింగ్ ఉంది.ఆయన కనుక బిజెపి కి జంప్ అయితే అది కాంగ్రెస్ కి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube