సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు క్రేజీ కాంబినేషన్లు అయినా ఆ కాంబినేషన్లలో వేర్వేరు కారణాల వల్ల సినిమాలు రావడం జరగదనే సంగతి తెలిసిందే.ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగా ఏ మాయ చేశావె సినిమాతో సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
అయితే అటు ప్రభాస్ కు ఇటు సమంత స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమాలు రాలేదు.
అయితే ఈ కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి సమంత హైట్ కారణమని సమాచారం.
ప్రభాస్ హైట్ మరో ఎక్కువగా ఉండటం సమంత హైట్ మరో తక్కువగా ఉండటం వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ కాలేదు.అయితే ఈ జోడీని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని కోరుకుంటున్న అభిమానుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది.
రాబోయే రోజుల్లో ప్రభాస్ సమంత కలిసి కనిపిస్తారేమో చూడాల్సి ఉంది.
ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రాజెక్ట్ కే సినిమాతో నాగ్ అశ్విన్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళతానని చెబుతుండగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్డేట్ ప్రేక్షకులకు కిక్కెక్కించేలా ఉంది.ప్రాజెక్ట్ కే నైజాం హక్కులు ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడై ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రూవ్ చేశాయి.
మరోవైపు సమంత శాకుంతలం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.సమంత ఆరోగ్యం గతంతో పోల్చి చూస్తే మెరుగుపడిందని శాకుంతలం మూవీ ప్రమోషన్లలో సమంత పాల్గొననున్నారని తెలుస్తోంది.శాకుంతలం సక్సెస్ సాధించి సమంత మార్కెట్ ను మరింత పెంచుతుందేమో చూడాలి.సమంత భవిష్యత్తు ప్రాజెక్ట్ ల బడ్జెట్లు భారీ స్థాయిలో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.
సమంత ఒక్కో ప్రాజెక్ట్ కు 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.