పవన్‌ కు జోడీగా 'ధమాకా' ముద్దుగుమ్మ.. అమ్మడికి భలే కలిసి వచ్చిందిగా!

పవన్ కళ్యాణ్ హీరోగా సాహో చిత్ర దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం లో ఒక సినిమా అధికారికంగా కన్ఫర్మ్‌ అయ్యింది.దానయ్య ఆ సినిమా ను నిర్మించబోతున్నట్లుగా కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది.

 Heroine Sreeleela To Act Opposite Pawan Kalyan,pawan Kalyan,heroine Sreeleela,su-TeluguStop.com

ఒక తమిళ సినిమాకు అది రీమేక్‌ అనే వార్తలు జోరుగా వస్తున్నాయి.ఈ సమయంలోనే ఆ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాల గురించి ఆసక్తికరంగా ప్రచారం జరుగుతోంది.

అతి త్వరలోనే హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యే అవకాశం ఉంది.ఆ తర్వాత హరీష్ శంకర్ మూవీ ని ముగించబోతున్న పవన్ కళ్యాన్ ఇదే ఏడాదిలో సుజీత్‌ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ కళ్యాణ్ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా లో ధమాకా ముద్దుగుమ్మ శ్రీలీలా ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని నిర్ణయించారు అంటూ వార్తలు వస్తున్నాయి.

పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీ లీలా ఇటీవల ధమాకా సినిమా తో సూపర్ హిట్‌ అందుకుంది.సీనియర్ హీరో అయిన రవితేజ కు జోడీగా శ్రీలీలా బాగా సెట్‌ అయ్యింది.అందుకే పవన్ కు జోడీ గా కూడా ఆమె కుదురుతుందని భావిస్తున్నారట.

అందుకే పవన్‌ కళ్యాణ్ సినిమా లో ఆమె ను హీరోయిన్ గా ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయట.కేవలం 15 నుండి 20 రోజుల డేట్లు మాత్రమే మేకర్స్ శ్రీ లీలా నుండి అడిగారు అంటూ సమాచారం అందుతోంది.

అందుకు గాను ఆమె భారీ మొత్తం లో డిమాండ్ చేసిందని.ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి ఒకటి రెండు రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఒక వేళ పవన్ కళ్యాణ్ కి జోడీగా శ్రీ లీలా హీరోయిన్‌ గా నటిస్తే మాత్రం కచ్చితంగా అమ్మడి యొక్క క్రేజ్‌ అమాంతం పెరిగి టాలీవుడ్‌ లో మోస్ట్‌ క్రేజీ హీరోయిన్‌ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube