కాజల్ అగర్వాల్‌ ఎంత ప్రయత్నించినా మన వాళ్లు పట్టించుకోవడం లేదట!

టాలీవుడ్ చందమామ కాజల్‌ అగర్వాల్‌ దాదాపు పుష్కర కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే.ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు తెలుగు సినీ లోకం తడిసి ముద్ద అయ్యింది.

 Kajal Aggarwal Looking For Movie Offer, Kajal Aggarwal,kajal Aggarwal Photoshoot-TeluguStop.com

అమ్మడికి స్టార్‌ హీరోల స్థాయి లో ఆధరణ లభించింది.అన్ని వర్గాల వారిని అలరించిన కాజల్‌ అగర్వాల్‌ సాధ్యం అయినంత వరకు ఎక్కువ మంచి సినిమాలు చేసింది.

లేడీ ఓరియంటెడ్‌ సినిమాల విషయంలో కాస్త ఇబ్బంది పడ్డా కూడా కమర్షియల్‌ హీరోయిన్ గా మాత్రం స్టార్‌ డమ్ చాటుకుంది.అందాల ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్ మరోసారి తన యొక్క అందాల ఆరబోత తో ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ముఖ్యంగా ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమా ల్లో మళ్లీ నటించాలి అని కోరుకుంది.కానీ ఇప్పటి వరకు ఈ అమ్మడి యొక్క కొత్త సినిమా లు ఏ ఒక్కటి కూడా కన్ఫర్మ్‌ అయినట్లుగా లేవు.

పెళ్లి ఆ తర్వాత తల్లి అవ్వడంతో కాజల్ అగర్వాల్‌ ను తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవడం లేదు.సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకులు మరియు ఫిల్మ్ మేకర్స్ వారు పెళ్లి అయిన వారికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు.అందుకే ఈ అమ్మడు అస్సలు సినిమా ల్లో ఆఫర్లు దక్కించుకోవడం లేదు.బాలీవుడ్‌ లో పెళ్లి అనే విషయాన్ని పట్టించుకోరు.కనుక ఈ అమ్మడు హిందీ లో ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు హాట్‌ ఫొటో షూట్స్ ను షేర్ చేస్తూ గతంలో కంటే కూడా అధికంగా అందంగా ఉన్నాను అంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంది.

అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్‌ యొక్క అందాన్ని మళ్లీ వెండి తెరపై ఎప్పుడు చూస్తామో అంటూ ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube