బిగ్ బాస్ షో కి తూట్లు పొడిచిన అసలు దోషులు ఎవరు ?

బిగ్ బాస్ ఫినాలే… ఆ జోష్ ఎక్కడ పోయింది .ఉసూరుమంటూ ఫైనల్ కి అయితే లాక్కొచ్చారు.

 Why Bigg Boss Will Be A Flop Show Details, Bigg Boss Season 6, Bigg Boss Flop Sh-TeluguStop.com

ఇంకో వారం తర్వాత ఉండాల్సిన ఫినాలే ఎవరు చూడట్లేదు కదా అని ముందుగానే క్లోజ్ చేశారు.దానికి కారణం షో కి వస్తున్న చీప్ రేటింగ్స్.

ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి ఎవరు విన్నర్ ? ఎవరు రన్నర్ ? అని చెప్పే కన్నా ఈ ఆటలో చిత్తుగా ఓడింది మాత్రం బిగ్ బాస్ షో అని ఒప్పుకోక తప్పదు.జనం ఓట్లు వేస్తున్నారు, వారి ఓట్ల ప్రకారమే ప్రతి వారం ఎలిమినేషన్ జరుగుతుంది, అలాగే విన్నర్ కూడా జనం వేసే ఓట్ల ద్వారానే నిర్ణయించబడతాడు అని ఇప్పటివరకు ఊదర గొట్టిన వస్తున్న బిగ్ బాస్ అసలు ఈ ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతారు.

లెక్క ప్రకారం శ్రీహన్ విజేత ఎందుకంటే అతనికి ఓట్లు ఎక్కువ వచ్చాయని నాగార్జున స్టేజ్ పై అనౌన్స్ చేశాడు.

కానీ విన్నర్ అయింది ఎవరు ? డబ్బు ఆశ చూపి ఎక్కువగా టెంప్ట్ చేసి అతడిని రన్నర్ ఆఫ్ గా బయటకు వచ్చేలా చేశారు.అప్పుడు జనాలు వేసిన ఓట్లకు విలువ ఎక్కడుంది.ఇదంతా స్క్రిప్ట్ దందా అని అనాల్సిందేనా.? మొదలుగా 10% అని తర్వాత 40 లక్షల వరకు ప్రైజ్ మనీ శ్రీహన్ తీసుకునేంతవరకు లాగి లాగి పట్టుకొచ్చారు.రేవంత్ ని విన్నర్ చేయాలని ముందుగానే భావించినట్టుగా చేసేసారు కానీ, గెలిచింది రేవంత్ కాదు కదా ? ఆ డబ్బులు తీసుకోకుండా ఉండి ఉంటే శ్రీహాన్ కదా విన్నర్ అవ్వాలి.

Telugu Biggboss, Bigg Boss Votes, Nagarjuna, Revanth, Srihaan-Movie

అంటే ఓట్లు వేసిన జనాలు పిచ్చి గొర్రలనే కదా వారి అభిప్రాయం.ఇక రేవంత్ విషయానికొస్తే అతడు గెలిచాడో ఆడాడో అతడికి అర్థం కాలేదు.ఎందుకంటే ట్రోఫీ మాత్రమే వచ్చింది.50 లక్షల్లో 40 లక్షలు శ్రీహాన్ పట్టుకెళ్ళిపోయాడు.మిగిలింది 10 లక్షలు దాంట్లో టిడిఎస్ 3 లక్షలు తీస్తే చేతికొచ్చేది ఏడు లక్షలు.ఇది తన బంధుమిత్రులకి పిఆర్ టీం కి పార్టీ ఇవ్వడానికి మాత్రమే సరిపోతుంది.

ఇక కారు, ఫ్లాటు ఇవేవీ కూడా ఉన్నాయా లేదో ఎవరికి తెలుసు.అటు గెలిచిన రేవంత్ కి ఏడుపే మిగిలింది.

శ్రీహన్ విషయానికొస్తే అతడు కూడా గెలిచి ఓడిపోయాడు.

Telugu Biggboss, Bigg Boss Votes, Nagarjuna, Revanth, Srihaan-Movie

ఓట్లు అతడికే పడ్డాయి.ఇద్దరికీ చివరికి మిగిలింది ఏడుపు మాత్రమే.ప్రేక్షకులు నిర్ణయించిన వారికి ఎందుకు ట్రోఫీ దక్కడం లేదు.

అందుకే బిగ్ బాస్ షో కి ఎవరు తూట్లు పొడవల్సిన పనిలేదు వారికి వారే స్వయంకృతారాధంతో తప్పులు చేస్తూ వస్తున్నారు.ఇప్పటివరకు చరిత్రలో లేనట్టుగా విన్నర్ కానీ వారికి 40 లక్షల వరకు కూడా డబ్బు ఆఫర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్.

రేవంత్ ని విన్నర్ చేయడానికి జరిగిన ప్రయత్నం గానే కనిపిస్తుంది.ఎందుకంటే ఇంత డబ్బు చూశాక మెంటల్ గా వీక్ అయ్యాడు శ్రీహన్.డబ్బు కోసం టెంప్ట్ అయ్యాడు.ఏది ఏమైనా బిగ్ బాస్ ఖచ్చితంగా ఒక ఫ్లాప్ షో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube