ఘనంగా బిగ్ బాస్ బ్యూటీ నేహా చౌదరి వివాహం... సందడి చేసిన బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్!

తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ముగిసింది.21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆదివారం గ్రాండ్ ఫినాలేను జరుపుకుంది.గ్రాండ్ ఫినాలేలో భాగంగా కీర్తి, రోహిత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్ టాప్ ఫైవ్ పొజిషన్లో ఉన్నారు.ఇక చివరికి శ్రీహాన్ 40 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకొని రన్నర్ గా నిలవగా, రేవంత్ ట్రోఫీ అందుకొని విజేతగా నిలిచారు.

 Bigg Boss Beauty Neha Chaudharys Wedding 6 Bigg Boss Contestants Made Noise , Bi-TeluguStop.com

ఇకపోతే ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం శ్రీహన్ మొదటి స్థానంలో ఉన్నారని నాగార్జున చివరికి ట్విస్ట్ ఇచ్చారు.

మొత్తానికి ఈ గ్రాండ్ ఫినాలే లో ఎంతోమంది సినీ తారలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు పాల్గొని సందడి చేశారు.

ఈ గ్రాండ్ ఫినాలే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్ట్ అందరికీ ఎంతో తీపి జ్ఞాపకంగా ఉండబోతుంది.ఇకపోతే ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి నేహా చౌదరికి కూడా గ్రాండ్ ఫినాలే తన లైఫ్లో స్పెషల్ గా మారింది.

ఆదివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే పూర్తి కాగా, అదే రోజు రాత్రి 10 గంటలకు ఆమె వివాహం కావడం విశేషం.పెళ్లికూతురుగా ముస్తాబైన నేహా చౌదరి గ్రాండ్ ఫినాలే లో పాల్గొని అనంతరం కంటెస్టెంట్లు అందరూ కూడా కల్యాణ మండపానికి రావాలని కోరింది.

ఈ క్రమంలోనే నేహా చౌదరి ఆదివారం రాత్రి 10 గంటలకు ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ఇక ఈ వివాహానికి బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్లు పాల్గొని సందడి చేశారు.ఇక ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు నేహా చౌదరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.స్పోర్ట్స్ యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి నేహా చౌదరి బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube