తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే ముగింపు దశకు చేరుకుంది.ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలిన విషయం తెలిసిందే.
హౌస్ లో 13వ వారం టికెట్ టు ఫినాలే టాస్కులు రసవత్తరంగా సాగుతున్నాయి.కంటిస్టెంట్లకు ఒక టాస్క్ ని మించి మరొక టాస్క్ ను టఫ్ గా ఇస్తూ మధ్య మధ్యలో ఏకాభిప్రాయం అన్న పిటిషన్ ను కూడా పెడుతూ కనిపిస్తుందని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు బిగ్ బాస్.
దీంతో కంటెస్టెంట్లకు ఎటు తేల్చుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.ఇది ఇలా ఉంటే 13వ వారం నామినేషన్ ప్రక్రియలో ఇనయ కెప్టెన్ కావడంతో ఎవరు ఆమెను నామినేట్ చేయకపోవడంతో శ్రీహాన్ సేఫ్ అయ్యాడు.
మిగిలిన ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో బిగ్ బాస్ రోహిత్ కి అన్యాయం చేస్తున్నాడు అన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఎందుకంటే నామినేషన్స్ లో కానీ టాస్కుల్లో కానీ రోహిత్ డిపెండ్ చేసుకునే సీన్లను టెలికాస్ట్ చేయడం లేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.రోహిత్ డిపెండ్ చేసుకునే విషయాలే కాకుండా తన భార్యకు మ్యారేజ్ యానివర్సరీ గ్రీటింగ్స్ చెప్పిన విషయాన్ని కూడా టెలికాస్ట్ చేయలేదు అంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.
కాగా ఇటీవల నవంబర్ 29న మెరీనా రోహిత్ లో వెడ్డింగ్ అనివర్సరీ కాగా ఉదయాన్నే బిగ్ బాస్ మ్యూజిక్ ప్లే చేయడంతో మెరినా నాకు విషెస్ చెప్పాడు రోహిత్.

కానీ అందుకు సంబంధించిన వీడియోని మాత్రం ప్లే చేయలేదు.అంతేకాకుండా బిగ్బాస్ టీం రోహిత్ కు ఎక్కువ ఓట్లు పడకుండా ఉండడం కోసం మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన కంటెస్టెంట్ ని టాప్ ఫైవ్ లో ఉంచేందుకు చేస్తుంది అంటూ నెటిజన్స్ ఆరోపిస్తున్నారు.అసలైన ఆట తీరు చూస్తే ప్రేక్షకులు అతనికి కచ్చితంగా ఓట్లు పడే అవకాశం ఉందని బిగ్ బాస్ టీం భయపడుతోందని తామ మేనేజ్మెంట్ కోటాలో తెచ్చుకున్న కంటెస్టెంట్స్ టాప్ ఫైవ్ లో ఉండలేరు అనేలా చేస్తుంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
మరి బిగ్ బాస్ కీ మేనేజ్మెంట్ కోటాలో ఎవరు వెళ్తారు అన్నది స్పష్టత రావడం లేదు.మొత్తానికి బిగ్ బాస్ 13వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా కూడా రోహిత్ ని బయటకు పంపించేయాలి అన్న ప్లాన్ లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.