ప్రముఖ దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా గురించి మాటల్లో చెప్పలేము.ఎంత సంపన్నుడైనప్పటికీ, సామాన్యులకి ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాడు.
సోషల్ మీడియాద్వారా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ… తన భావాలను ఫాలోయర్స్ తో పంచుకుంటూ ఉంటాడు.ఈ క్రమంలో నూతన ఆవిష్కరణలను ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు.
అదే ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది.కొత్త కొత్త అంశాలపై స్పందిస్తూ నిత్యం స్పందిస్తూ వీలైనంత సాయం చేస్తూ ఉంటాడు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కొత్త సృజనాత్మక ఆవిష్కరణను ట్విటర్ వేదికగా నెటిజన్లకు పరిచయం చేశారు.ఇక్కడ ఫొటోలో గమనిస్తే ఓ వాహహానం చూడటానికి బైక్‌లా కనిపిస్తుంది చూడండి… ఎంత పొడుగ్గా వుందో.
ఆరుగురు కూర్చునే విధంగా, వేర్వేరు సీట్లతో పొడవుగా రూపొందించిన ఓ బ్యాటరీ వాహనం ఆనంద్ మహీంద్రా మనసుని దోచుకుంది.దాన్ని ఒకసారి ఛార్జింగ్ పెడితే దీనిపై దాదాపు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉందని సమాచారం.ఇక దీని ఖరీదు కూడా రూ.10,000 నుంచి 12,000 వరకు మాత్రమే ఉంటుందని భోగట్టా.
ఐరోపాలోని ట్రాపిక్ ఎక్కువుగా ఉండే పర్యాటక కేంద్రాల్లో కనిపించే టూర్ బస్సులాఉంది అది చూడటానికి.కేవలం చిన్నపాటి డిజైన్ మార్పులతో ఈ వాహనాన్నీ అంతర్జాతీయంగా దాన్ని వినియోగించవచ్చని చూసిన నెటిజన్లు చెబుతున్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని రవాణారంగ ఆవిష్కరణలు తనను ఎప్పుడూ ఆకట్టుకుంటాయని, ఇక్కడ అవసరాలే ఆవిష్కరణలకు మూలం అంటూ ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ పెట్టడం కొసమెరుపు.యువకుడి ప్రతిభను ప్రశంసిస్తూ.
నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.