బుల్లితెర జోడీలలో ఒకటైన రాకేశ్ సుజాత జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్న ఈ జోడీ త్వరలో పెళ్లికి సంబంధించిన శుభవార్త చెప్పాలని అభిమానులు భావిస్తున్నారు.
తాజాగా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో రాకేశ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాకేశ్ తన తల్లితో అమ్మా.
ఈవిడే నీ కోడలమ్మా అని చెప్పగా కోడలొస్తే కోడిని కోయాలి కానీ కోడినే తీసుకొస్తే ఏం కోయాలి నాన్నా అంటూ కామెంట్లు చేశారు.టీ తాగు నాన్న అని రాకేశ్ కు తల్లి టీ ఇవ్వగా ఇప్పుడు టీ వద్దు ఏం వద్దు వెళ్లు అంటూ రాకేశ్ కామెంట్ చేస్తాడు.
ఆ తర్వాత సుజాత రాకేశ్ తో రాకీ నీకోసం టీ అని ఇవ్వగా నీ చేతితో ఇస్తే టీ ఏంటిరా విషమైనా తాగుతానురా అని చెబుతాడు.రాకేశ్ టీ తాగే సమయంలో రాకేశ్ తల్లి కోపంగా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు ప్రోమోకు హైలెట్ అయ్యాయి.
ఈ ప్రోమోకు భారీ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.ఇతర కంటెస్టెంట్ల స్కిట్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.
సుధీర్ లేకపోవడం ఈ షోకు మైనస్ కాగా సుధీర్ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.రష్మీ సుధీర్ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ మామూలు క్రేజ్ కాదు.
ఈ మధ్య కాలంలో ఈ షో రేటింగ్స్ తగ్గుతుండగా రాబోయే రోజుల్లో రేటింగ్స్ పుంజుకుంటాయేమో చూడాలి.
సుజాతపై ఉన్న ప్రేమను రాకేశ్ స్కిట్ లో చూపించారని అందుకే ఆమె చేతిలో విషం ఇచ్చినా తాగుతానని కామెంట్ చేశాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సుజాత రాకేశ్ పెళ్లి తేదీకి సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.