Pawankalyan bjp : పవన్ ను ఇరకాటంలో పెట్టిన బీజేపీ ? వారంతా దూరం ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది.దూకుడుగా రాజకీయాలు చేస్తూ, వైసిపి ప్రభుత్వంను విమర్శిస్తూ గత కొంతకాలంగా పవన్ యాక్టివ్ గా ఉంటున్నారు.

 Bjp Has Put Pawan In Trouble? How Far Are They Pavan Kalyan, Bjp, Tdp, Chandraba-TeluguStop.com

ఎక్కడికక్కడ జనసేన కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు.ప్రభుత్వంపై రాజీ లేకుండా పోరాటం చేస్తూ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని మించిన స్థాయిలో జనసేన జనాల్లోకి వెళ్తోంది.

ఇదే దూకుడుతో ఎన్నికల వరకు వెళితే జనసేన కు ఊహించని స్థాయిలో ఆదరణ ఉంటుందని, అంతా అంచనా వేస్తున్న సమయంలోనే పవన్ దూకుడుకు బిజెపి బ్రేకులు వేసింది.టిడిపితో కలిసి ఎన్నికలను ఎదుర్కోవాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడం ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని పవన్ భావించినా, బిజెపి మాత్రం టిడిపిని కలుసుకుని వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.

        ప్రధాని నరేంద్ర మోదిని పవన్ కళ్యాణ్ కలిశారు.ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలపై వీరి మధ్య జరిగింది.స్పష్టంగా వీరి మధ్య జరిగిన  చర్చ ఏమిటి అనేది తెలియనప్పటికీ టిడిపిని కలుపుకు వెళ్లేందుకు మాత్రం ప్రధాని నిరాకరించారని, బిజెపి జనసేన లు మాత్రమే రాబోయే ఎన్నికలను ఎదుర్కోవాలని పవన్ సూచించినట్లుగా ప్రచారం జరిగింది.దీనికి తగ్గట్లుగానే ప్రధానితో సమావేశం ముగిసిన తర్వాత పవన్ తో పాటు, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైలెంట్ అయ్యారు.

జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఈ మధ్యనే నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.అంతేకాదు ప్రధానితో తాము ఏ అంశాల గురించి చర్చించాము అనేది ఎన్నికల వరకు చెప్పమని నాదెండ్ల వ్యాఖ్యానించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

అయితే టిడిపిని దూరం పెట్టాలని బిజెపి సూచించింది.ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలను కలుపుకు వెళ్లాలని పవన్ చూసినా, బీజేపీతో పొత్తు అధికారికంగా రద్దు చేసుకుంటే తప్ప, తాము జనసేనతో కలిసి నడవలేమని వామపక్ష పార్టీలు ప్రకటించాయి.
   

Telugu Amith Sha, Bjpjanasena, Chandrababu, Janasenani, Pavan Kalyan, Ysrcp-Poli

   ఏపీలో వామపక్ష పార్టీలు, టిడిపికి ఉన్నంత స్థాయిలో బిజెపికి బలం లేదు.అలా అని బిజెపితో పొత్తు తెగతెంపులు చేసుకుంటే ఆ తరువాత తలెత్తే పరిణామాలను పవన్ ఊహించారు.అందుకే బిజెపికి దూరమయ్యేందుకు ఆ పార్టీతో పొత్తు రద్దు చేసుకునేందుకు ఆయన వెనకడుగు వేస్తున్నారు.ఇదే ఇప్పుడు పవన్ కు ఇబ్బందికరంగా మారింది.బిజెపి జనసేన పొత్తు కొనసాగినంత కాలం టిడిపి తో పాటు, వామపక్ష పార్టీలు జనసేనకు దూరంగానే ఉంటాయి.దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వబోము అంటూ పవన్ చెప్పిన పవన్ కు బీజేపీ వైఖరి కారణంగా ఆ శపథం నెరవేర్చుకునే అవకాశం కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube