Akkineni Nageswara Rao: అక్కినేనిని మూడేళ్లపాటు రవీంద్ర భారతి కి వెళ్లకుండా చేసింది ఎవరు ?

అక్కినేని , ఎన్టీఆర్ బయటకు కనిపించకపోయినా మంచి స్నేహితులు.రాజకీయాల్లోకి వెళ్దాం అంటూ ఎన్టీఆర్ చెప్పిన అక్కినేని కి ఆసక్తి లేకపోవడం తో ఎన్టీఆర్ ఒక్కడే ఒంటరిగా తెలుగు దేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే సీఎం అయ్యాడు.

 Why Akkineni Nageswara Rao Didnt Want To Go Ravindra Bharathi For 3 Years Detail-TeluguStop.com

కానీ అక్కినేని ని ఎన్ని సార్లు రమ్మని చెప్పిన రాజకీయాల్లోకి రాలేదని ఎన్టీఆర్ కి మనసులో ఉండేది.కానీ ఒకసారి రవీంద్ర భారతి లో ఎదో ఒక ప్రోగ్రాం లో ఉపన్యాసం ఇస్తూ కాషాయం కట్టుకున్న వారెవరు సన్యాసులు కారు అంటూ ఎదో ఫ్లో లో చెప్పేసాడు.

అప్పటికే ఎన్టీఆర్ సంసారం జీవితం వద్దని ఆస్తులను కొడుకులకు పంచి కాషాయ వస్రాలను ధరిస్తూ ఉన్నారు.

అయితే రవీంద్ర భారతి లో ఉపన్యాసం జరుగుతున్న సమయంలో విన్నవారెవరో ఎన్టీఆర్ కి తప్పుగా మోసేసారు.

ఎన్టీఆర్ ని ఉద్దేశించి అక్కినేని ని ఆ వ్యాఖ్యలు చేసారంటూ చెప్పడం తో ఆ మాటలను ఎన్టీఆర్ నమ్మేశారు.దాంతో ఎన్టీఆర్ కి అక్కినేని పై చాల కోపం కూడా ఉండేది.

ఇప్పటి నుంచి రవీంద్ర భారతి అక్కినేని ఎలాంటి స్పీచ్ ఇచ్చిన ఆ టేప్ తనకు పంపాలని ఎన్టీఆర్ సీఎం హోదాలో ఆర్డర్ వేసారట.ఈ విషయం అక్కినేని కి కూడా తెలిసింది.

తాను ఆ ఉద్దేశం తో అనలేదు కాబట్టి ఆ వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకోలేదు అక్కినేని.కానీ ఎన్టీఆర్ కి మాత్రం అప్పటి నుంచి ఆ కోపం ఆలా పెరుగుతూనే వుంది.

Telugu Akkineni, Nagarjuna, Nandamuritaraka, Sr Ntr, Sr Ntr Anr, Tollywood-Movie

కానీ ఆ విషయాన్నీ ఎన్టీఆర్ తనని అడిగి విషయాన్నీ సాల్వ్ చేసుకొని ఉండి ఉంటె బాగుండు అని అక్కినేని అనుకున్నారు.కానీ అది జరగలేదు.ఇక అప్పటి నుంచి ఒక మూడేళ్ళ వరకు రవీంద్ర భారతి లో అడుగు కూడా పెట్టలేదు అక్కినేని.రెండో సారి ఎన్టీఆర్ సీఎం అయ్యాక కూడా అక్కినేని ని ఎన్టీఆర్ ఆహ్వానించినా ఎదో మొక్కుబడిగా అయన వెళ్లనున్న నాగార్జున వెళ్లారు.

ఇక బయట ఫంక్షన్స్ లో కలిసిన ఏడ మొహం గానే ఉండేవారు.దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియో పైన కొన్ని కేసులు కూడా నమోదు చేయించారు ఎన్టీఆర్.

ఇలా చిన్న విషయం చిలికి చిలికి గాలి వానగా, పెను తుఫాన్ గా కూడా మారింది.మళ్లి కొన్నాళ్ళకు ఒకసారి ఎన్టీఆర్ అక్కినేని ని ఇంటికి పిలిపించుకొని సారీ చెప్పారట.

అంతటితో ఆ విషయం సర్దు మణిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube