Oman Lakshmi Narasimha Swami : ఎడారి దేశంలో యాదాద్రి...తన్మయత్వంతో పులకరించిపోయిన ప్రవాసులు...!!!

దేశం ఏదైనా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి సంస్కృతుల మధ్యన ఉన్నా సరే మన తెలుగు బాషను, సంస్కృతీ, సాంప్రదాయాలను మర్చిపోకుండా తూచా తప్పకుండా పాటించే వాళ్ళు మన తెలుగు ఎన్నారైలు.విదేశంలో ఉన్నాం కదా మనకెందుకులే అనుకోకుండా భావి యువతీ యువకులకు మన సంస్కృతిని అందించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

 Yadadri In The Desert Country Expatriates Who Are Thrilled With Their Devotion ,-TeluguStop.com

ఈ క్రమంలోనే అరబ్బు దేశమైన ఒమన్ లో మన తెలుగు ఎన్నారైలు చేపట్టిన లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరు కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.పూర్తి వివరాలలోకి వెళ్తే.

ప్రవాస కార్మికలు అత్యధికంగా వలసలు వెళ్ళే అరబ్బు దేశాలలో ఒకటైన ఒమన్ లో ఉంటున్న తెలంగాణా వాసులు అందరూ కలిసి తెలంగాణా సమితిని ఏర్పాటు చేసుకున్నారు.ఈ సమితి ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామీ వారి తిరు కళ్యాణాన్ని నిర్వహించాలని తలపెట్టి తెలంగాణా రాష్ట్రంలో యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామీ వారి ఆలయ కమిటిని సంప్రదించి ఒమన్ లో తిరు కళ్యాణం ఏర్పాటు చేశారు.

దాంతో .

Telugu Lakshmisimha, Oman, Yadadri, Yadadridesert, Yadarigigutta-Telugu NRI

యాదరిగి గుట్ట స్వామి వారి ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహా చార్యులు, తన బృందంతో కలిసి ఒమన్ లో కళ్యాణం జరిపించారు.ఈ కళ్యాణ మహోశ్చవాన్ని తిలకించడానికి ఒమన్ చుట్టుపక్కల నుంచీ తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు తరలి వచ్చారు.కళ్యాణం జరుగుతున్న ఆధ్యాంతం భక్తులు నమో నారసింహాయ నామ స్మరణతో కార్యక్రమ ప్రాంగణం మారుమోగి పోయింది.

ఎడారి దేశంలో ఇలా స్వామి వారిని దర్శించుకుని కళ్యాణం తిలకించేలా అవకాశం కల్పించిన తెలంగాణా సమితికి తెలుగు వారందరూ కృతజ్ఞతలు తెలిపారు.వచ్చిన భక్తులకు నిర్వాహకులు భోజనాలు ఏర్పాటు చేయగా, అయ్యప్ప స్వాములు వంటలను స్వయంగా వడ్డించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube