సినీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలకు ఒక సినిమా కోసం పెట్టుబడి పెట్టినప్పటి నుంచి ఆ సినిమా విడుదలై వసూలు వచ్చేవరకు ఎన్నో టెన్షన్స్ తోనే ఉంటారు.మధ్యలో దర్శకులు, హీరోలు పెట్టే ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు.
ఎందుకంటే ఒక్కసారి డబ్బులు పెట్టి అందులోకి దూకారు అంటే.దర్శకులు, హీరోలు ఏం చెప్పినా వినాల్సిందే.
లేదంటే ఏదైనా కారణంగా సినిమా ఫ్లాప్ అయితే ఆ తిప్పలు ఉండేవి నిర్మాతకే కాబట్టి.అందుకే నిర్మాతలు ఒక సినిమాకు పెట్టుబడి పెట్టారంటే ఆ సినిమాకు కావలసిన ప్రతి విషయంలో బాగా వాళ్లే బాధ్యతలు తీసుకుంటారు.
మధ్యలో షూటింగు ఏదైనా కారణాలవల్ల ఆగిపోతే అప్పుడు కూడా నిర్మాతలకే కష్టం.
ముఖ్యంగా భారీ భారీ సెట్ లు వేయించినప్పుడు ఏదైనా కారణాల వల్ల ఆగిపోయినా కూడా నిర్మాతలకే నష్టం.
అలా ఇప్పటికి చాలామంది నిర్మాతలు తమ నిర్మించే సినిమాలలో ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు.అలా గతంలో ఒక నిర్మాత కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఇంతకూ ఆ నిర్మాత ఎవరంటే.టాలీవుడ్ ఇండస్ట్రీకి డి ఎస్ రావు.
ఈయన కేవలం నిర్మాతనే కాకుండా నటుడుగా విలన్ పాత్రలలో కూడా చేశాడు.మొదట ఆయన హోరాహోరీ సినిమాలో విలన్ గా చేశాడు.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.ఇవ్వడం తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ భాషలలో కూడా నటించాడు.
ఇక మెల్లి మెల్లిగా నిర్మాతలుగా కూడా బాధ్యతలు చేపట్టాడు.
ద్రోణ, పిల్ల జమిందార్, కళావర్ కింగ్, మిస్టర్ నూకయ్య వంటి మంచి మంచి సినిమాలకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.
దాదాపు 20 కి పైగా సినిమాలకు నిర్మాతగా చేశాడు డిఎస్ రావు.అయితే ఈయన నిర్మాతగా కొన్ని నష్టాలు కూడా ఎదుర్కొన్నాడు.గతంలో ఓ సినిమా విషయంలో ఆయనకు భారీ నష్టం జరిగింది.ఇంతకు ఆ సినిమా ఏంటంటే.
ద్రోణ.
తాజాగా డిఎస్ రావు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో చాలా విషయాలు పంచుకున్నాడు.
అంతేకాకుండా ద్రోణ సినిమా సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని కూడా పంచుకున్నాడు.ఇంతకు అది ఏంటో తెలుసుకుందాం.నితిన్ నటించిన ఈ సినిమాకు డిఎస్ రావు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.ఈ సినిమా సమయంలో డిఎస్ రావు ఒక సెట్ వద్దని పట్టు పట్టిన కూడా ఈ సినిమా దర్శకుడు వినకుండా ఓ సెట్ వేయించాడట.
అది కూడా గోవాలో అని తెలిపాడు.అయితే దర్శకులకు ఐలాండ్ ప్లేస్ కావాలి అనడంతో వెంటనే ఈయన వైజాగ్ దగ్గర వేయిస్తే బాగుంటుంది అని అన్నాడట.కానీ అక్కడ వేయిద్దాం అనటంతో సరే అని అన్నాడట డిఎస్ రావు.అయితే మొత్తానికి గోవాలో సెట్ వేయించారట.
ఇక ఆ సెట్ కోసం నెల రోజుల ముందు గోవాకి వెళ్లారట.
అయితే అక్కడ ఒకతను జూలై 10 నుంచి వర్షాలు పడతాయని అన్నాడట.అయినా కూడా వీలు వినకుండా మూర్ఖంగా వెళ్లి సెట్ వేయించారట.కానీ అదే డేటు రోజు వర్షం వచ్చిందట.అలా దాదాపు నెలరోజులు వర్షం పడుతూనే ఉందట.తమ సినీ బృందం మొత్తం నాలుగు రోజులు అక్కడ ఉన్నా కూడా వర్ష ప్రభావం తగ్గకపోవటంతో ఇంటికి చేరుకున్నారట.
మళ్లీ కొన్ని నెలల తర్వాత ఆ సెట్ గురించి ఆలోచించారట.
అయితే ఓ ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ ని తీసుకొని గోవా కి వెళ్ళాడట. ఆ సెట్ చెక్కుచెదరకుండా అలాగే కేవలం కలర్స్ వేసుకుంటే సరిపోతుంది అని అనటంతో మళ్లీ అందరూ గోవా కి వెళ్లారట.
ఆ తర్వాత కలర్స్ తో మొత్తం సెట్ ని నీట్ గా సెట్ చేశారట.
అయితే కొన్ని రోజుల తర్వాత షూటింగు ఆపేస్తున్నాము అని నితిన్ తండ్రి అన్నాడట.ఎందుకంటే ఆ సమయంలో వర్మకి డేట్స్ ఇచ్చాము అని అన్నాడట.వర్మ సినిమా చేస్తే క్రేజ్ బాగా పెరిగిపోతుంది.
ఆ తర్వాత మన సినిమా రిలీజ్ చేస్తే మరింత క్రేజ్ వస్తుంది అని అన్నాడట.దీంతో అతను ఒప్పుకోక తప్పలేదట.
అలా సమయంలో అందరూ తన నెత్తిన టోపీ పెట్టారు అంటూ కామెంట్ చేశాడు డిఎస్ రావు.