Bollywood Actress Urfi Javed : అలాంటి దుస్తులు వేసుకుంటే చంపేస్తామని బెదిరించారు.. నటి కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ వస్త్రధారణ విషయంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తూ ఉంటారు.సాధారణంగా సినీ సెలబ్రిటీలు పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ షో చేస్తుంటారు.

 They Threatened To Kill Me If I Wore Such A Dress.. The Actress's Comments Went-TeluguStop.com

అయితే వారందరికీ భిన్నంగా ఈమె వస్త్రధారణ ఉంటుందని చెప్పాలి.కేవలం ప్రైవేట్ పార్ట్ లను మాత్రమే దాచి అందాలను ఆరబోస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలిచారు.

ఇలా ఈ ముద్దుగుమ్మ బోల్డ్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా అదే డ్రస్సులలో బయట తిరగడంతో ఎంతోమంది ఈమె వస్త్రధారణ పై మండిపడ్డారు.

ఇకపోతే తాజాగా ఉర్ఫీ జావేద్ వస్త్రధారణ గురించి ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోసారి తను కనుక ఇలాంటి దుస్తులు ధరిస్తే మాత్రం తనని చంపేస్తానంటూ బెదిరించారు.ఇలా ఈమె వస్త్ర ధారణ గురించి మాట్లాడుతూ తనని చంపేస్తామని బెదిరింపులు రావడంతో అతను చేసినటువంటి పోస్టును ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆ వ్యక్తిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఉర్ఫీ జావేద్ మాట్లాడుతూ తనని చంపేస్తానని బెదిరించిన ఈ వ్యక్తి తనకు తెలుసని వెల్లడించారు.

Telugu Urfi Javed-Movie

గతంలో నాతో ఎంతో మంచిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి తనకు సహాయం చేయకపోవడంతో ఇలా తనని చంపేస్తానని బెదిరిస్తున్నాడు అంటూ ఈమె కామెంట్ చేశారు.అయినా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో వేసుకోకూడదనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం అని తన వస్త్రధారణ గురించి మాట్లాడటానికి నువ్వెవరు అంటూ ఈమె తన గురించి వచ్చినటువంటి బెదిరింపులపై స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube